తక్షణమే శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేయాలని గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావును కోరినట్టు తమిళనాడు ప్రతిపక్ష నాయకుడు, డీఎంకే నేత ఎంకే స్టాలిన్ తెలిపారు. బుధవారం తమ పార్టీ నాయకులతో పాటు గవర్నర్ ను ఆయన కలిశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... రైతు సమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీని సమావేశపరచాలని గవర్నర్ కు విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు.