రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను విశ్వనగరంగా అభివృద్ధి చేసే క్రమంలో పలు పనులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. నగరవాసులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి.. విశ్వనగర పనుల్లో భాగంగా సిగ్నల్ ఫ్రీగా చేపట్టనున్న మల్టీ లెవెల్ ఫ్లైఓవర్లు, జంక్షన్ల అభివృద్ధి పనులకు ఆదివారం శంకుస్థాపనలు జరగనున్నాయి.