ఏదైనా తప్పు తాను చేసినప్పుడు, దాన్ని ఎత్తిచూపినవారిపై ఆరోపణలు చేయడం చంద్రబాబు నాయుడుకు అలవాటేనని ప్రతిపక్షనేత, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసం ఢిల్లీలో వివిధ జాతీయ పార్టీల నాయకులను కలుస్తున్న ఆయన... అందులో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిశారు. వైఎస్ఆర్‌సీపీ గుర్తుపై గెలిచి అనంతరం పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు నలుగురికి మంత్రి పదవులు కూడా ఇచ్చిన అంశాన్ని వైఎస్ జగన్ ఈ సందర్భంగా జైట్లీ దృష్టికి తీసుకు వెళ్లారు.