హుదూద్ తుపాను విలయం సృష్టించిన ఉత్తరాంధ్ర జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం రాజమండ్రి బయల్దేరి వెళ్లిన ఆయన అక్కడ నుంచి విశాఖ జిల్లాకు చేరుకున్నారు. ప్రస్తుతం జగన్ విశాఖ పరిసర ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా నక్కపల్లి మండలంలోని కాగిత గ్రామంలో పర్యటించి బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తుపాన్ ప్రభావంతో నష్టపోయిన వారికి తమ పార్టీ సహకారం అందిస్తుందన్నారు. ప్రభుత్వం నుంచి అందాల్సిన సాయం బాధితులకు వచ్చే వరకూ వైఎస్సార్ సీపీ పోరాడుతుందన్నారు.