చిరంజీవి, నాగార్జునతో తలసాని భేటీ | Talasani Srinivas Yadav Meets Chiranjeevi And Nagarjuna In Annapurna Studios | Sakshi
Sakshi News home page

చిరంజీవి, నాగార్జునతో తలసాని భేటీ

Published Mon, Feb 10 2020 7:15 PM | Last Updated on Fri, Mar 22 2024 11:10 AM

సినీ ప్రముఖులు చిరంజీవి, నాగార్జునలతో తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సోమవారం భేటీ అయ్యారు. నగరంలోని అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతున్న ఈ సమావేశంలో పలు  ప్రభుత్వ శాఖల అధికారులు కూడా పాల్గొన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధి, సినీ కళాకారుల సంక్షేమానికి చేపట్టాల్సిన చర్యలు, ఇతర అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. అలాగే హైదరాబాద్‌లో సినీ ఇండస్ట్రీని పటిష్టం చేయడంతోపాటు పుణె తరహా ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ను నిర్మించడంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చినట్టుగా తెలుస్తోంది. 

Advertisement
 
Advertisement
 
Advertisement