బెంగళూరు: కన్నడ హీరోయిన్ మయూరి క్యాటరీ లాక్‌డౌన్ సమయంలో సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారు. తన స్నేహితుడైన అరుణ్‌ను వివాహమాడారు. శుక్రవారం ఉదయం స్థానిక శ్రీతిరుమలగిరి శ్రీ లక్ష్మీవెంకటేశ్వరస్వామి ఆలయంలో వీరిద్దరి వివాహం చాలా సింపుల్‌గా జరిగింది. లాక్‌డౌన్ నిబంధనలు పాటిస్తూ అతి కొద్దిమంది బంధువుల సమక్షంలో మయూరి వివాహం జరిగిందని ఆమె సన్నిహితులు పేర్కొన్నారు.