Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Chandrababu  Missing calculations in kuppam
ఓటమి బాటలో బాబు

చంద్రబాబు 35 ఏళ్ల కుప్పం ప్రస్థానంలో జరిగిన ఎన్నికల్లో వచ్చిన ఓట్లు, సీట్లను బట్టి చూస్తే గత ఐదేళ్లలో వైఎస్సార్‌సీపీ గట్టి పట్టు సాధించిందని స్పష్టమవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు వచ్చిన ఓట్లను, ఇటీవల తొలగించిన 33 వేల టీడీపీ దొంగఓట్లను పరిగణనలోకి తీసుకుంటే, మే 13న జరిగిన ఎన్నికలో కుప్పం అసెంబ్లీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి భరత్‌ గెలుపు వాకిట నించున్నారని తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, మద్దతుదారులకు వచ్చిన ఓట్ల కంటే కేవలం 3–4 వేల ఓట్లు (0.02%) మాత్రమే అదనంగా అవసరం. అయితే భారీగా టీడీపీ దొంగ ఓట్లకు చెక్‌ పడటంతో కుప్పంలో చంద్రబాబు ఓడి పోబోతున్నారని స్పష్టమవుతోంది. ఇటు ఓటర్లు, అటు రాజకీయ విశ్లేషకులు, పలు సర్వే నివేదికలు చెబుతున్న వాస్తవం ఇది. సాక్షి, తిరుపతి: ఐదేళ్ల సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో జరిగినంత మేలు చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ జరగలేదని, అందుకే కుప్పం ప్రజలు వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఓటెత్తారని స్పష్టమవుతోంది. 35 ఏళ్ల పాటు మాయ మాటలతో ప్రజలను నమ్మించి.. సీఎంగా, ఎమ్మెల్యేగా కొనసాగిన చంద్రబాబును కుప్పం ఓటర్లు ఈసారి శంకరగిరి మాన్యాలకు పంపుతున్నట్లు ఈవీఎంలలో ఫ్యాన్‌ గుర్తుపై గట్టిగా నొక్కి చెప్పినట్లు తెలుస్తోంది. 2019 సాధారణ, స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పం వాసులు ఇచ్చిన తీర్పే.. ఇప్పుడూ పునరావృతం కాబోతోందని సమాచారం. నాటి చంద్రబాబు.. నేటి వైఎస్‌ జగన్‌ పాలనను బేరీజు వేసుకునే ఓటర్లు ఓటెత్తారని స్పష్టమవుతోంది. సీఎం వైఎస్‌ జగన్‌ ఐదేళ్ల పాలనలో డీబీటీ ద్వారా 4,32,067 మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రూ.1,400 కోట్లకుపైగా జమ చేశారు. నాన్‌ డీబీటీ ద్వారా మరో 3,03,080 మంది లబ్ధిదారులకు రూ.1,175.21 కోట్లు అందించారు. కుప్పం వాసులకు కలగా మారిన కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌కు కృష్ణా జలాలు తీసుకొచ్చారు. చంద్రబాబు ఉన్నన్ని రోజులు అదిగో ఇదిగో అంటూ కాలం గడిపేశారు. వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యాక హంద్రీ–నీవా సృజల స్రవంతిలో భాగంగా రూ.560.29 కోట్లతో కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ పనులను పూర్తి చేసి కృష్ణా జలాలను తీసుకొచ్చి కలను నిజం చేశారు. కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ వివరాలు » పలమనేరు నియోజకవర్గం అప్పిన పల్లి వద్ద 0 పాయింట్‌ నుంచి కుప్పం మండలం పరమసముద్రం వరకు సుమారు 124 కి.మీ వరకు హంద్రీ–నీవా కాలువ తవ్వారు.» 5 కిలోమీటర్లలో పశు పత్తురు వద్ద, 39వ కిలోమీటర్‌ కృష్ణాపురం వద్ద లిఫ్ట్‌ ఏర్పాటు» వి.కోట మండలం ఆదిరే పల్లి 54.కి.మీ వద్ద లిఫ్ట్‌ల ద్వారా హంద్రీ–నీవా కృష్ణా జలాలు అందించారు.» కుప్పం నియోజకవర్గంలో 110 చెరువులకు నీళ్లివ్వడం ద్వారా 6,500 ఎకరాల ఆయకట్టుకు అండగా నిలిచారు. » అనంతపురం జిల్లా చెర్లోపల్లి రిజర్వాయర్‌ నుంచి 300 క్యూసెక్కుల నీరు హంద్రీ–నీవా కాలువలు ద్వారా విడుదలవుతుంది. ఆవిరి, లీకేజీ పోగా 220 క్యూసెక్కుల నీరు కుప్పం చేరుతుంది. 4 లక్షల జనాభాకు తాగు నీరు అందుతుంది. కుడి ఎడమల సంక్షేమం, అభివృద్ధి» వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక కుప్పం నియోజకవర్గంలో ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందించడంతో పాటు పలు అభివృద్ధి పనులు పూర్తయ్యాయి.» కుప్పం మేజర్‌ పంచాయితీని మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్‌ చేసి, పట్టణ అభివృద్ధి కోసం రూ.66 కోట్లు ప్రత్యేక నిధులు కేటాయించారు.» నియోజకవర్గాన్ని రెవెన్యూ డివిజన్‌ చేయటంతో పాటు.. కుప్పం పోలీస్‌ డివిజన్‌ ఏర్పాటు చేశారు. ఆర్డీఓ, డీఎస్పీలను నియమించారు.» రూ.15 కోట్ల వ్యయంతో కుప్పం పట్టణ నడిబొడ్డు, డికే పల్లి వద్ద రైల్వే అండర్‌ బ్రిడ్జిలు నిర్మించారు.» నియోజకవర్గంలో ఏడు పురాతన దేవాలయాలు జీర్ణోద్ధరణకు సుమారు రూ.12 కోట్లు వెచ్చించారు.» రూ.5 కోట్ల వ్యయంతో మున్సిపాలిటి పాలన వ్యవస్థ కోసం ప్రత్యేకంగా రెండు అంతస్తుల నూతన భవనాలు నిర్మించారు.» శాంతిపురం మండలంలోని కేటీ పల్లి, పోడిచేన్లు, ప్రతిచామనూరులకు రూ 7.25 కోట్లతో తారు రోడ్లు, సిమెంట్‌ రోడ్డు వేయించారు. » నియోజకవర్గంలో 78 సచివాలయాలకు రూ.87.55 కోట్లు ఖర్చు చేశారు. రూ.15.77 కోట్లతో 77 రైతు భరోసా కేంద్రాలు, రూ.7.9 కోట్లతో 58 వెల్‌నెస్‌ సెంటర్లు ఏర్పాటు చేశారు. » కుప్పం మున్సిపాలిటీ పరిధిలో మరో రూ.100 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. »కుప్పంలో మెజారిటీ ఓటర్లుగా ఉన్న వన్నె కులస్తుల కోసం క్షత్రియ భవనం ప్రారంభించారు.బాబును గెలిపిస్తూ వచ్చింది దొంగ ఓట్లేచంద్రబాబు 1989 నుంచి కుప్పంలో గెలుపొందుతూ వచ్చారు. కుప్పం వాసుల అమాయకత్వంతో పాటు పక్కనే ఉన్న కర్ణాటక, తమిళనాడుకు చెందిన 52 వేల మంది పేర్లను ఓటర్ల జాబితాలో చేర్చి.. దొంగ ఓట్లు వేయించుకోవడమే ఇందుకు కారణం. 2014, 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఐఏఎస్‌ అధికారి చంద్రమౌళి.. బాబు దొంగ ఓట్ల బాగోతాన్ని బయటపెట్టారు. ఎన్నికల సమయంలో కర్ణాటక, తమిళనాడు నుంచి జనం భారీగా తరలివచ్చి, ఓట్లు వేసి వెళ్లటం గమనించిన చంద్రమౌళి దొంగ ఓట్లపై విచారణ జరిపించారు. అధికారుల విచారణలో దొంగ ఓట్లు ఉన్నట్టు తేలడంతో ఇదివరకు 18 వేల ఓట్లు, ఈ ఎన్నికలకు ముందు 33 వేల ఓట్లు తొలగించారు. దొంగ ఓట్లను తొలగించటంతో పాటు కుప్పం వాసులు చైతన్య వంతులు కావటంతో చంద్రబాబుకు భయం పట్టుకుంది. కుటుంబ సమేతంగా కుప్పానికి పరుగు» కుప్పంలో 2014 ముందు ఒక లెక్క. ఆ తర్వాత ఒక లెక్క అన్న చందంగా మారింది. వైఎస్సార్‌సీపీ రానంత వరకు అన్ని గ్రామాల్లో చంద్రబాబు చెప్పిందే శాసనంలా సాగింది. భయపెడుతూ.. బెదిరిస్తూ ప్రత్యర్థి లేకుండా జాగ్రత్త పడుతూ వచ్చారు. 2014లో వైఎస్సార్‌సీపీ అడుగు పెట్టడంతో షాక్‌ల మీద షాక్‌లు తగలటం మొదలయ్యాయి. » బాబు అండ్‌ కో బ్యాచ్‌ అరాచకాలను జీర్ణించుకోలేని స్థానికులు ప్రతి గ్రామంలో టీడీపీకి పోటీగా వైఎస్సార్‌సీపీ జెండాను ఎగుర వేయటం ప్రారంభించారు. 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో మొదటి రెండు రౌండ్లలో టీడీపీ అభ్యర్థి కంటే వైఎస్సార్‌సీపీ అభ్యర్థికే మెజారిటీ ఓట్లు నమోదవ్వటంతో చంద్రబాబు షాక్‌కు గురయ్యారు. 2019 తర్వాత జరిగిన స్థానిక సంస్థలకు జరిగిన అన్ని ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ క్లీన్‌ స్వీప్‌ చేసింది. సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ, మున్సిపల్‌ చైర్మెన్‌ అంతా వైఎస్సార్‌సీపీ మద్దతు దారులే గెలుపొందటంతో చంద్రబాబు మైండ్‌ బ్లాక్‌ అయ్యింది. » 35 ఏళ్లుగా కుప్పంలో ఇల్లు కట్టుకోవాలనే ఆలోచనే చేయని చంద్రబాబుకు వైఎస్సార్‌సీపీ నేతల మాటలతో జ్ఞానోదయం అయింది. ఎట్టకేలకు ఇంటి నిర్మాణం చేపట్టారు. కుప్పానికి చుట్టపు చూపుగా వచ్చి వెళ్లే చంద్రబాబు.. 2019 ఎన్నికల తర్వాత కుటుంబ సమేతంగా పరుగులు పెట్టారు. 2014–19 మధ్య కాలంలో సీఎం హోదాలో చంద్రబాబు 8 పర్యాయాలు మాత్రమే కుప్పానికి ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. 2019–2024 మధ్య 14 సార్లు కుప్పం రావడంతో పాటు కనీసం రెండు, మూడు రోజులు ఉండి వెళ్తున్నారు.» కుమారుడు లోకేశ్, సతీమణి భువనేశ్వరి సైతం కుప్పం దారిపట్టారు. ఓటమి భయంతోనే లోకేశ్‌ తన పాదయాత్రను కుప్పం నుంచి ప్రారంభించి అభాసుపాలయ్యారు. నారా భువనేశ్వరి ఇటీవలి కాలంలో రెండు పర్యాయాలు కుప్పానికి వచ్చి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గతంలో చంద్రబాబు నామినేషన్‌ వేయటానిక్కూడా కుప్పానికి వచ్చిన దాఖలాలు లేవు. స్థానిక నాయకులే చందాలు వేసుకుని ఆయన తరుఫున నామినేషన్‌ వేసేవారు. అటువంటిది ఈసారి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి నేరుగా కుప్పానికి చేరుకుని, సొంత డబ్బులతో నామినేషన్‌ వేశారు. అనంతరం గడప గడపకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఓటుకు రూ.2 వేలు పంపిణీచంద్రబాబు గతంలో కుప్పంలో ఓటర్లకు పెద్దగా డబ్బులు ఇచ్చిన దాఖలాలు లేవు. స్థానిక నాయకులే అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమంగా సంపాదించిన సొమ్ములో నుంచి ఓటుకు రూ.200 లేదా రూ.300 పంపిణీ చేసేవారు. ఈ నగదు కూడా ఓటర్లందరికీ ఇచ్చేవారు కాదు. సగం ఓటర్లకు ఇచ్చి మిగిలిన సగం నగదు నొక్కేసి అందరికీ పంపిణీ చేశామని లెక్క చూపేవారని ఆరోపణలు ఉన్నాయి. అటువంటి చంద్రబాబు ఈ ఎన్నికల్లో మే 10, 11, 12 తేదీల్లో ఒక్కో ఓటుకు రూ.2 వేలు చొప్పున డబ్బులు పంపిణీ చేశారు. ఈ నగదును చంద్రబాబే స్వయంగా పంపించారని స్థానిక టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు. చంద్రబాబు మరోసారి ఎమ్మెల్యేగా గెలిచేందుకే డబ్బులు పంపిణీ చేసి మాయ చేయాలని చూస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ 2019 ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చారని, ఐదేళ్ల పాటు సంక్షేమ పథకాల ద్వారా కుటుంబ ఆర్థిక పురోభివృది్ధకి దోహద పడ్డారని, కుప్పాన్ని అభివృద్ధి చేసినందుకే తాము ఫ్యాన్‌ గుర్తుకు ఓటేశామని అత్యధికులు స్పష్టం చేస్తున్నారు.బాబు కుప్పం ప్రస్థానం 1989లో పోలైన ఓట్లు: 95,157చంద్రబాబుకు వచ్చిన ఓట్లు: 50,098 (52.65%)మెజారిటీ: 6,9181994లో పోలైన ఓట్లు: 1,07,582చంద్రబాబుకు వచ్చిన ఓట్లు: 81,210 (75.49%)మెజారిటీ: 56,5881999లో పోలైన ఓట్లు: 1,25,357 చంద్రబాబుకు వచ్చిన ఓట్లు: 93,288 (74.42%)మెజారిటీ: 65,687 2004లో పోలైన ఓట్లు: 1,40,153 చంద్రబాబుకు వచ్చిన ఓట్లు: 98,123–(70%– 4.42% తగ్గాయి.. 6,195 ఓట్లు కోల్పోయారు)మెజారిటీ: 59,5882009లో పోలైన ఓట్లు: 1,45,287చంద్రబాబుకు వచ్చిన ఓట్లు: 89,954 (61.9% – 8.1% తగ్గాయి.. 11,770 ఓట్లు కోల్పోయారు)మెజారిటీ: 46,0662014లో పోలైన ఓట్లు: 1,64,071చంద్రబాబుకు వచ్చిన ఓట్లు: 1,02,953 (62.5% –0.6% పెరిగాయి. 985 ఓట్లు అదనంగా వచ్చాయి)మెజారిటీ: 47,1212019లో పోలైన ఓట్లు: 1,79,329చంద్రబాబుకు వచ్చిన ఓట్లు: 1,00,146 (55.18% – 7.32% తగ్గాయి. 13,127 ఓట్లుకోల్పోయారు)మెజారిటీ: 30,722 మే 13న జరిగిన ఎన్నికలో కుప్పంలోమొత్తం ఓటర్లు: 2,13,145 పోల్‌ అయిన ఓట్లు: 1,83,027 (85.87%)గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి వచ్చిన ఓట్లు2014 – 55,839 ఓట్లు (33.9%)2019 – 69,424 ఓట్లు (38.25% – 4.35% పెరుగుదల

ECcontroversial stance in cases of vandalism of EVMs
మరీ ఇంత ‘పచ్చ’పాతమా!

దర్శి: రాష్ట్రంలో ఎన్నికల కమిషన్‌ వ్యవహార శైలి వివాదాస్పదంగా మారుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ నెల 13వ తేదీన పోలింగ్‌ జరిగింది. ఈ సందర్భంగా ఈవీఎంలు ధ్వంసం చేసిన కేసుల్లో ఈసీ ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోందన్న ఆరోపణలకు దర్శి ఘటన బలం చేకూరుస్తోంది. పల్నాడు జిల్లా మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేశారంటూ వచ్చిన ఫిర్యాదుపై 10 రకాల సెక్షన్లు నమోదు చేశారు. దీనికి సంబంధించి ఓ వీడియో ఫుటేజ్‌ బయటకు వచ్చింది.ఈ విషయంపై పచ్చ మీడియా చిలువలుపలువలుగా కథనాలు ప్రచురిస్తోంది. ఇదే తరహాలో ప్రకాశం జిల్లా దర్శిలో టీడీపీ నేతలు ఈవీఎంను ధ్వంసం చేశారు. దానిని పగులగొట్టిన టీడీపీ నేత వీసీ రెడ్డిపై తీసుకున్న చర్యలు మాత్రం నామమాత్రం. 13వ తేదీ పోలింగ్‌ జరుగుతున్న సందర్భంగా దర్శి ఎంఈవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన బూత్‌లో ఎంపీ అభ్యర్థికి చెందిన ఈవీఎంను టీడీపీ నేత వేమిరెడ్డి చెన్నారెడ్డి(వీసీ రెడ్డి) పగులగొట్టాడు. ఇదే బూత్‌ సమీపంలో టీడీపీ నేతలు వీరంగం చేయడంతో కొంతసేపు అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది.నిందితుడికి 41ఏ నోటీసులతో సరి ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో వీసీ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, 41ఏ నోటీసులు ఇచ్చా­రు. పోలీస్‌ స్టేషన్‌లో కళ్లు తిరుగుతున్నాయని చెప్పగా వీసీ రెడ్డిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రి నుంచి వీసీ రెడ్డి పరారయ్యాడు. 41ఏ నోటీసులు తీసుకున్న వ్యక్తి పోలీసుల అను­మతి లేకుండా గ్రామం విడి­చి వెళ్లకూడదు. పోలీసుల కళ్లుగప్పి పారిపోయిన నిందితుడు ఒంగోలు రామ్‌నగర్‌లో నివాసముంటున్న టీడీపీ కీలక నేత కుమారుడి వద్ద ఆశ్రయం పొందినట్లు గత పది రోజులుగా ప్రచారం జరిగింది. సద­రు నాయకుడి ఒత్తిడి మేరకే వీసీ రెడ్డిపై పోలీస్‌ అధికారులు ఉదాశీన వైఖరిని అవలంబిస్తున్నారని, చట్ట ప్రకా­రం కేసులు నమోదు చేయకుండా తాత్సా­­రం చేస్తున్నారన్న ఆరోపణలున్నా­యి. ఇదిలా ఉండగా.. బుధ­వారం వీసీ రెడ్డి దర్శి­లోని ఓ రెస్టారెంట్‌లో ఉన్న సమయంలో అదుపులోకి తీసుకున్నట్టు పోలీసు వర్గాలు చెబుతుండటం గమ­నార్హం. ఈవీఎం ధ్వంసం చేసిన విషయం, నరసరావుపేట నుంచి వచ్చిన 150 మంది టీడీపీ గూండాలు దర్శి నియోజకవర్గంలో చేసిన రచ్చను ఉద్దేశపూర్వకంగా దా­చేసిన ఎల్లో మీడియా.. వైఎస్సార్‌సీపీ నాయ­కులపై మాత్రం విషం చిమ్మడాన్ని ఆపడం లేదు.

Ap Elections 2024 May 23rd Political Updates Telugu
May 23rd: ఏపీ పొలిటికల్‌ అప్‌డేట్స్‌

May 23rd AP Elections 2024 News Political Updates..7:00 AM, May 23rd, 2024ఓటమి బాటలో బాబుకుప్పంలో తప్పిన లెక్కలు.. వికటించిన వ్యూహాలుఇన్నాళ్లూ చంద్రబాబును గెలిపించింది 51 వేల దొంగ ఓట్లే రెండు విడతలుగా ఆ ఓట్ల తొలగింపు దీంతో ఓటమికి దగ్గరవుతూ వచ్చిన బాబుస్థానిక సంస్థల ఎన్నికలన్నింటిలోనూ టీడీపీ ఘోర పరాజయం 35 ఏళ్లుగా కుప్పం ప్రజలను నమ్మించి మోసం చేసిన వైనం వైఎస్సార్‌సీపీ రాకతో ప్రతి ఇంటికీ సంక్షేమం, అభివృద్ది మారుతూ వచ్చిన ఓటర్ల తీర్పు.. గత ఎన్నికల్లో తగ్గిన మెజారిటీ ఈ దఫా ఓటమి ఖాయం అని తేలడంతో కుటుంబ సమేతంగా పరుగులు కుప్పంలో ఓటు, ఇల్లు లేని బాబు.. ఓటమి భయంతో ఇంటి నిర్మాణ పనులు ఓటుకు రూ.2 వేలు పంపిణీ చేసినా విఫల యత్నమే అంటున్న స్థానికులు 6:50 AM, May 23rd, 2024కుట్ర విఫలం వల్లే రాద్ధాంతం ఘోర ఓటమి భయంతో టీడీపీ నేతల దారుణకాండవైఎస్సార్‌సీపీకి దన్నుగా నిలిచే వర్గాల వారు ఓట్లు వేయకుండా అడ్డుకునే కుట్ర పల్నాడు, తాడిపత్రి, జమ్మలమడుగు, చంద్రగిరి సహా రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్‌ రోజున అల్లర్లు పోలింగ్‌ కేంద్రాల్లో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను బయటకు నెట్టి రిగ్గింగ్‌ చేసిన టీడీపీ రౌడీలు వెబ్‌ కాస్టింగ్‌లో అరాచకపర్వం స్పష్టంగా కన్పిస్తున్నా పట్టించుకోని ఎన్నికల అధికారులు టీడీపీ మూక రిగ్గింగ్‌ను అడ్డుకునేందుకు యత్నించిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లిపోలింగ్‌ రోజున తమ కుట్ర విఫలమవడంతో టీడీపీ అండ్‌ గ్యాంగ్‌ యాగీ 6:40 AM, May 23rd, 2024టీడీపీ రిగ్గింగ్‌.. పూర్తి వీడియో బయటపెట్టాలి: కాసు మహేష్‌రెడ్డిమాచర్లలో చాలా చోట్ల టీడీపీ నేతలు రిగ్గింగ్‌ చేశారుపిన్నెల్లి గెలుపును ఎవరూ ఆపలేరని.. దీనిపై ఎంతవరకైనా పోరాటం చేస్తాంపిన్నెల్లి తప్పు చేశారని టీడీపీ ప్రచారం చేస్తోందిమొత్తం వీడియో బయటపెడితే అసలు వాస్తవాలు బయటకు వస్తాయి.ఒక్కటే వీడియో ఎందుకు రిలీజ్‌ చేశారు?రిగ్గింగ్‌ జరిగిందని చెప్తుంటే... ఎందుకు వీడియో రిలీజ్‌ చేయడం లేదు?మాచర్లలో ఎవరు దాడి చేశారో ప్రజలందరికి తెలియాలిమాచర్లలో అల్లర్లకు కారణం ఎవరు? టీడీపీ కాదా?బీసీలు, ఎస్టీలు వైఎస్సార్‌సీపీకి ఓటేశారనే కారణంతో దాడులు చేశారుఅందరికీ చట్టపరమైన శిక్ష పడేవరకు పోరాడతాంరిగ్గింగ్‌ జరిగిందని మేము చెబుతున్నాం.. మీరు ఎందుకు వీడియో బయటపెట్టడం లేదు?ఎన్నికల అధికారులు ఆరోజు ఏమైందనేది మొత్తం వీడియో బయటపెట్టాలిఈవీఎం ధ్వంసం ఘటనకు ముందు 2, 3 గంటల వీడియో బయటపెట్టాలిమమ్మల్ని హౌస్‌ అరెస్ట్‌ చేసి టీడీపీ నేతలు రిగ్గింగ్‌ చేశారుదాడులకు సంబంధించి ఈసీ పూర్తి వీడియోలు బయటపెట్టాలిఏడు చోట్ల ఈవీఎంల ధ్వంసం జరిగిందని ఈసీనే చెబుతోందిమాచర్ల వీడియోను మాత్రమే బయటపెట్టారుమిగిలిన వీడియోలను ఎందుకు బయటపెట్టడం లేదుఈసీ విశ్వసనీయత కోల్పోతుంది. అవసరమైతే న్యాయ పోరాటం చేస్తాం 6:30 AM, May 23rd, 2024మాచర్ల నియోజకవర్గంలో అరాచకాలు చేసింది టీడీపీ నేతలేమాచర్లలో టీడీపీ నేతల రిగ్గింగ్‌ఒక్కొక్కటిగా బయటపడుతున్న వీడియోలువైఎస్సార్‌సీపీ మద్దతుదారులను ఓటు వేయనివ్వకుండా అడ్డుకున్న టీడీపీ మూకలురెంటచింతల మండలం పాల్వాయి గేటులోని 201, 202 పోలింగ్‌ బూత్‌లో టీడీపీ రిగ్గింగ్‌టీడీపీ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడుతున్నా పట్టించుకోని ఎన్నికల అధికారులుఓటర్లను ఓటు వేయనివ్వని టీడీపీ నేతలుఓటర్లు బూత్‌ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో దాడులకు తెగబడ్డ టీడీపీ నేతలుటీడీపీ నేతల రిగ్గింగ్‌పై పోలీసులు, ఎన్నికల అధికారులకు పిన్నెల్లి ఫిర్యాదులుఎమ్మెల్యే ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు

Daily Horoscope On 23th May 2024 In Telugu
Daily Horoscope: ఈ రాశి వారు ఊహించని కార్యాల్లో పాల్గొనే అవకాశం

శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు వైశాఖ మాసం, తిథి: పౌర్ణమి సా.6.42 వరకు, తదుపరి బహుళ పాడ్యమి నక్షత్రం: విశాఖ ఉ.8.51 వరకు, తదుపరి అనూరాధ వర్జ్యం: ప.1.03 నుండి 2.43 వరకు, దుర్ముహూర్తం: ఉ.9.47 నుండి 10.35 వరకు, తదుపరి ప.2.59 నుండి 3.47 వరకు అమృతఘడియలు: రా.11.04 నుండి 1.10 వరకు. మేషం : ప్రయత్నకార్యాల్లో దిగ్విజయం పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబం అంతా సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఒక ముఖ్యమైన పని పూర్తికావడంతో మిక్కిలి ఆనందిస్తారు. కీర్తి, ప్రతిష్ఠలు పొందుతారు. శాశ్వత పనులకు శ్రీకారం చుడతారు. వృషభం : ఆర్థిక ఇబ్బందులు ఉండవు. నూతన వస్తు, ఆభరణాలను ఖరీదు చేస్తారు. స్నేహితులను కలుస్తారు. ఇతరులకు మంచి సలహాలు, సూచనలిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ధైర్యసాహసాలతో కొన్ని పనులు పూర్తిచేస్తారు. శుభవార్తలు వింటారు.మిథునం : ఊహించని కార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగరంగాల్లో అభివృద్ధి ఉంటుంది. ఆత్మీయులను కలవడంలో విఫలమవుతారు. అనవసర వ్యయప్రయాసల వల్ల ఆందోళన చెందుతారు. వృథా ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. స్త్రీల మూలకంగా ధనలాభం ఉంటుంది.కర్కాటకం: ఆకస్మిక ధనలాభం ఉంది. క్రీడాకారులు, రాజకీయరంగాల్లోని వారికి అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. అన్నింటా విజయాన్నే సాధిస్తారు. బంధు, మిత్రులు కలుస్తారు. శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగరంగాల్లోనివారికి అభివృద్ధి ఉంటుంది.సింహం ; స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన గృహకార్యాలపై శ్రద్ధవహిస్తారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. దైవదర్శనం చేసుకుంటారు. భక్తి శ్రద్ధలు అధికమవుతాయి.కన్య : కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభంతో రుణబాధలు తొలగిపోతాయి. సమాజంలో మంచిపేరు సంపాదిస్తారు. ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవడానికి కృషిచేస్తారు. స్త్రీలు, బంధు, మిత్రులను కలుస్తారు.తుల : ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. అనారోగ్య బాధవల్ల బలహీనులవుతారు. అధికార భయం ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది.వృశ్చికం : మిక్కిలి ధైర్య సాహసాలు కలిగి ఉంటారు. సూక్ష్మబుద్ధితో విజయాన్ని సాధిస్తారు. మీ పరాక్రమాన్ని ఇతరులు గుర్తిస్తారు. శతృబాధలు తొలగిపోతాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక లాభాలు ఉంటాయి.ధనుస్సు: అనుకోకుండా కుటుంబంలో కలహాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అశుభవార్తలు వినాల్సి వస్తుంది. ఆకస్మిక ధననష్టం జరుగకుండా జాగ్రత్త పడటం మంచిది. మనస్తాపానికి గురవుతారు. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. నూతనకార్యాలు వాయిదా వేసుకోక తప్పదు.మకరం : కుటుంబ కలహాలు దూరమవుతాయి. ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. వృథా ప్రయాణాల వల్ల అలసట చెందుతారు. చెడు పనులకు దూరంగా ఉండటం మంచిది. అందరితో స్నేహంగా ఉండటానికి ప్రయత్నించాలి. ఆర్థిక ఇబ్బందులు స్వల్పంగా ఉంటాయి.కుంభం: కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. ఆకస్మిక ధనలాభంతో ఆనందాన్ని పొందుతారు. ఇతరులకు ఉపకారం చేసే కార్యాల్లో నిమగ్నులవుతారు. స్త్రీల మూలకంగా లాభం ఉంది. పేరు, ప్రతిష్ఠలు లభిస్తాయి. రుణబాధలు తొలగిపోతాయి. ఆరోగ్యం మెరుగవుతుంది.మీనం: తోటివారితో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. వ్యాపార మూలకంగా ధననష్టం కలిగే అవకాశాలున్నాయి. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. కుటుంబ విషయాల్లో అనాసక్తితో ఉంటారు. స్త్రీలు విశ్రాంతి తీసుకోవడం అవసరం.

TDP Yellow gangs rigged by threatening voters at Palwai Gate
‘గేటు’లో గూండాగిరి.. ఓటర్లను బెదిరించి పచ్చముఠాల రిగ్గింగ్‌

సాక్షి, నరసరావుపేట / రెంటచింతల: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేశారని చెబుతున్న పాల్వాయి గేటులోని పోలింగ్‌ బూత్‌లో ఆ రోజు అసలు ఏం జరిగిందన్నది కీలకంగా మారింది. మే 13న రెంటచింతల మండలం పాల్వాయిగేటు 201, 202 పోలింగ్‌ బూత్‌లలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలను బెదిరించి టీడీపీ గూండాలు భయానక వాతావరణం సృష్టించారు. పోలింగ్‌ సజావుగా జరగకుండా అడ్డుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని నియోజకవర్గ రిటర్నింగ్‌ అధి­కారితోపాటు పల్నాడు కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేసేందుకు పిన్నెల్లి పలుసార్లు ఫోన్‌ చేసినా వారు స్పందించలేదు. తమ పార్టీ పోలింగ్‌ ఏజెంట్లను పోలింగ్‌ కేంద్రం నుంచి బయటకు లాక్కొచ్చి దాడు­లు చేయడంతోపాటు టీడీపీ నేతలు రిగ్గింగ్‌ చేస్తు­న్నారనే సమాచారం అందడంతో పిన్నెల్లి అక్కడకు చేరుకున్నట్లు చెబుతున్నారు. యథేచ్ఛగా జరుగుతున్న రిగ్గింగ్‌ను ఆయన ప్రతిఘటించారు. ఈ క్ర­మం­లో వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే పచ్చ ముఠాలు పల్నాడు ప్రాంతంలో దాదాపు ఏడు చోట్ల ఈవీఎంల విధ్వంసాలకు తెగబడగా దీన్ని అడ్డుకున్న పిన్నెల్లి వీడియోను మాత్రమే బహిర్గతం చేయడం వెనుక కుట్రకోణం ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఈసీకి మొర పెట్టుకున్నా... పాల్వాయిగేట్, తుమృకోట, ఒప్పిచర్ల, చింతలపల్లి పోలింగ్‌ కేంద్రాలలో గతంలో పలుమార్లు టీడీపీ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. ఆయా కేంద్రాలలో పటిష్ట బందోబస్తు కల్పించి ఎన్నికలు సజావుగా సాగేలా చూడాలని పిన్నెల్లి పలు దఫాలు ఈసీ, కలెక్టర్, ఎస్పీలను అభ్యరి్థంచినా స్పందించలేదు. పోలింగ్‌ రోజు కూడా రెండుసార్లు ఈసీకి మొర పెట్టుకున్నా ఫలితం శూన్యం. పాల్వాయి గేట్‌ పోలింగ్‌ కేంద్రంలో టీడీపీ అరాచకాలకు సహకరించేందుకు 50 ఏళ్లకు పైగా వయసున్న పోలీసు కానిస్టేబుల్‌కే విధులు కేటాయించారు. వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను చితకబాది.. పాల్వాయి గేట్‌ కేంద్రంలో వైఎస్సార్‌ సీపీ పోలింగ్‌ ఏజెంట్లుగా ఉన్న చింతా సుబ్బారావు, డేరంగుల శ్రీను, చల్లా సుబ్బయ్యలను టీడీపీ నేతలు కొట్టి బయటకు ఈడ్చేశారు. ఓటు వేయడానికి క్యూలో నిలబడ్డ మహిళలను భయకంపితుల్ని చేసి తరిమేశారు. అనంతరం అక్కడ టీడీపీ నేతలు యథేచ్ఛగా రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. స్థానికులతో కలసి మరోసారి దీన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలింగ్‌ ఏజెంట్లపై విచక్షణారహితంగా దాడి చేయడంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దృష్టికి తెచ్చారు. దీంతో అక్కడకు చేరుకున్న పిన్నెల్లి రిగ్గింగ్‌ను ప్రతిఘటించారు. దీన్ని అడ్డుకోవాలని పోలింగ్‌ అధికారులను అభ్యరి్థంచారు. టీడీపీ మూకల అరాచకాలను ఎన్నికల అధికారుల దృష్టికి తెచి్చనా స్పందించలేదు. పిన్నెల్లి కుమారుడు గౌతమ్‌రెడ్డి, డ్రైవర్‌ అంజిరెడ్డి, మరికొందరిపై టీడీపీ నేతలు దాడులు చేసి తీవ్రంగా గాయపరిచారు. పిన్నెల్లి కాన్వాయ్‌లోని వాహనాలను ధ్వంసం చేశారు. ఓటర్లు, ఏజెంట్లను భయపెట్టి రిగ్గింగ్‌ చేస్తున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. ఆ వీడియో ఒక్కటే.. వారం తరువాత మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్‌ రోజు మొత్తం ఏడు ఈవీఎంలు ధ్వంసమయ్యాయి. ఒక్క పాల్వాయి గేటు వీడియో మినహా మిగతావి ఏవీ బయటకు రాలేదు. అది కూడా వారం తరువాత తాపీగా విడుదల చేయడంపై సందేహాలు ముసురుకుంటున్నాయి. ఈవీఎంలు ధ్వంసమైన మిగిలిన ఆరు వీడియోలను ఎన్నికల సంఘం ఇప్పటికీ బయట పెట్టకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీడియోను తాము రిలీజ్‌ చేయలేదని పోలీసులు, రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. పలువురు అధికారులపై సస్పెన్షన్‌ వేటు పడిన తరువాత విదేశాల్లో గడుపుతున్న నారా లోకేష్‌ ‘ఎక్స్‌’ ఖాతా నుంచి వీడియో పోస్టు కావడం గమనార్హం. ఈసీ ఆదీనంలో ఉండాల్సిన వీడియో లోకేష్‌ చేతికి ఎలా వచి్చందనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఈసీ వ్యవహరించిన తీరు కూడా వివాదాస్పదంగా మారింది. పాల్వాయి గేట్‌ పోలింగ్‌ బూత్‌లో టీడీపీ మూకలు రిగ్గింగ్‌ చేస్తుంటే ఎందుకు స్పందించలేదు? ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నా ఏమి పట్టనట్లు వ్యవహరించడం ఏమిటి? ఫిర్యాదులు అందినా ఎందుకు పట్టించుకోలేదు? అనే ప్రశ్నలకు ఈసీ జవాబు చెపాల్సి ఉంది. మాచర్ల నియోజకవర్గంలో వంద శాతం వెబ్‌ కాస్టింగ్‌ జరుగుతోంది. 202 పోలింగ్‌ బూత్‌లో ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలిసినా ఉదాశీనంగా ఉండటంపై అనుమానాలు ముసురుకుంటున్నాయి. తుమృకోటలో దాడులు.. ఈవీఎంలు ధ్వంసం రెంటచింతల మండలం తుమృకోటలో వైఎస్సార్‌ సీపీ సానుభూతిపరులైన ఎస్సీ, ముస్లిం మైనార్టీలపై టీడీపీ నేతలు దాడి చేశారు. 203, 204, 205 పోలింగ్‌ కేంద్రాల్లో ఈవీఎంలను ధ్వంసం చేశారు. రీపోలింగ్‌ జరపకుండా సాయంత్రం 4 గంటల సమయంలో కొత్త ఈవీంఎలతో తిరిగి పోలింగ్‌ కొనసాగించారు. ఆ సమయంలో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు లేకుండా రిగ్గింగ్‌ చేశారు. ఈ వీడియోలను ఎన్నికల సంఘం బయటపెట్టలేదు. కారంపూడి మండలం ఒప్పిచర్లలో వైఎస్సార్‌సీపీ పోలింగ్‌ ఏజెంట్‌ పాలకిర్తి శ్రీనివాసరావుపై టీడీపీ అగ్రవర్ణ నేతలు దాడి చేసి పోలింగ్‌ కేంద్రం నుంచి ఈడ్చేసి అక్రమ కేసు బనాయించారు. ఈసీ డేటా భద్రమేనా?సాక్షి, నరసరావుపేట: పాల్వాయి గేట్‌ పోలింగ్‌ బూత్‌లో ఈవీఎం «ధ్వంసం వీడియోపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజంగా అది సీసీ ఫుటేజేనా? లేక మార్ఫింగ్‌ చేసిన వీడియోనా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. వీడియో కుడివైపు పైభాగంలో మొబైల్‌ 5జీ సిగ్నల్, 65 శాతం బ్యాటరీ పర్సంటేజ్, అలారం ఇండికేషన్స్‌ కనిపించడం గమనార్హం. వీడియోలో మొత్తం నిడివి 23.52 గంటలు ఉండగా 12.06 గంటల వద్ద తమకు అవసరమైన మేరకు రెండు నిమిషాల పాటు మొబైల్‌లో రికార్డు చేసినట్టు స్పష్టమవుతోంది. ఎంతో భద్రంగా ఉండాల్సిన పోలింగ్‌ వెబ్‌ కాస్టింగ్‌ సమాచారం బయటకు వెళ్లడంపై సందేహాలు అలుముకుంటున్నాయి. ఈ వీడియో తొలుత నారా లోకేష్‌ ఎక్స్‌ ఖాతా, టీడీపీ సోషల్‌ మీడియా గ్రూప్‌లలో కనిపించింది. అంటే వారి ద్వారానే బయటకు వచి్చనట్టు తేలిపోతోంది. గ్రాఫిక్స్‌కు పెట్టింది పేరైన పచ్చ ముఠాల వీడియోను నిర్థారించుకోకుండా, ఎలా బయటకు వచి్చందనే విషయాన్ని పట్టించుకోకుండా ఈసీ కేసు నమోదుకు ఆదేశించడంపై విస్మయం వ్యక్తమవుతోంది. 53 గ్రామాల్లో దాడులుసాక్షి, ప్రత్యేక ప్రతినిధి / సాక్షి, నరసరావుపేట: పల్నాడులోని 53 గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ శ్రేణులపై, ఇళ్లపై టీడీపీ మూకలు దాడులకు తెగబడ్డాయి. ఆస్తులను ధ్వంసం చేశాయి. పోలింగ్‌ నాడు టీడీపీ నాయకులు హింసాకాండకు పథకం రూపొందించినట్లు మంత్రి అంబటి, పిన్నెల్లి తదితరులు ఎన్నికల యంత్రాంగానికి ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా స్పందించలేదు. వీడియోను మొబైల్‌లో రికార్డు చేశారని చెప్పడానికి గల ఆధారాలు.. ఆ వీడియో వెనుక అసలు నిజాలు..⇒ మే 13న పాల్వాయిగేటు పోలింగ్‌ కేంద్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా ఓటర్లను టీడీపీ మూకలు అడ్డుకున్నాయి. ⇒ పాల్వాయి గేట్‌లోని అన్ని బూత్‌లను ఆక్రమించి పచ్చ ముఠాలు రిగ్గింగ్‌కు పాల్పడ్డాయి. ⇒ బ్రహా్మరెడ్డి కుట్రలను ముందే పసిగట్టి మే 11న పిన్నెల్లి ఈసీకి లేఖ రాశారు. ⇒ సమస్యాత్మక ప్రాంతమైన మాచర్లలో భారీగా పోలీసులను మోహరించాలని పిన్నెల్లి కోరారు. ⇒ టీడీపీ అరాచకాలకు పాల్పడినందున రీ పోలింగ్‌ నిర్వహించాలని లేఖలో పిన్నెల్లి కోరారు.⇒ ప్రజాస్వామ్యాన్ని టీడీపీ ఖూనీ చేసినందున రీ పోలింగ్‌ జరపాల్సిందేనని అభ్యరి్థస్తూ పిన్నెల్లి మరో లేఖ రాశారు. ⇒ టీడీపీ కుట్రలపై మే 11న ఒక లేఖ, పోలింగ్‌ జరిగిన మే 13న రెండు లేఖలను పిన్నెల్లి ఈసీకి రాశారు. ⇒ 11 చోట్ల ఈవీఎంలు ధ్వంసం అయినట్లు ఎన్నికల అధికారి ప్రెస్‌ మీట్‌ నిర్వహించి మరీ చెప్పారు. ⇒ టీడీపీ గూండాలు 10 చోట్ల ఈవీఎంలను ధ్వంసం చేసే ఆ వీడియోలను ఎందుకు బయట పెట్టలేదు?⇒ నారా లోకేష్‌ ఫిర్యాదుతో 8 రోజుల తరువాత ఒక వీడియో విడుదల చేసి అరెస్టుకు ఆదేశాలిచ్చారు.దాడి చేసి.. రిగ్గింగ్‌202 పోలింగ్‌ బూత్‌లోకి టీడీపీ నేతలు పెద్ద సంఖ్యలో ప్రవేశించి నాతో పాటు డేరంగులు శ్రీను, చల్లా సుబ్బయ్యలపై దాడి చేశారు. చితకబాది పోలింగ్‌ బూత్‌ బయటకు లాక్కొచ్చారు. అనంతరం టీడీపీ నేతలు రిగ్గింగ్‌ చేశారు. అక్కడున్న పోలీసులు, పోలింగ్‌ అధికారులు ఏమాత్రం అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. దీంతో మేం పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చాం. అక్కడకు వచి్చన పిన్నెల్లి, ఆయన అనుచరులపై పచ్చమూకలు దాడులకు పాల్పడ్డాయి. –చింతా సుబ్బారావు, ఇన్‌చార్జి సర్పంచి,వైఎస్సార్‌సీపీ ఏజెంట్, పాల్వాయి గేట్‌పల్నాడు గ్రామాల్లో టీడీపీ దురాగతాలు..⇒ మాచర్ల రూరల్‌ మండలం: కొత్తూరు, కంభంపాడు, భైరవునిపాడు ⇒ రెంటచింతల: రెంటాల, జెట్టిపాలెం, పాలవాయిగేటు, గోలి, మిట్టగుడిపాడు ⇒ కారంపూడి: ఒప్పిచర్ల, కారంపూడి, పేటసన్నెగండ్ల, చింతపల్లి ⇒ దుర్గి: ముటుకూరు, అడిగొప్పల, పోలేపల్లి ⇒ వెల్దుర్తి: లోయపల్లి, వెల్దుర్తి, వజ్రాలపాడు, గొట్టిపాడు, నర్సపెంట ⇒ గురజాల: కేసానుపల్లి, మాదినపాడు, ఇరిగేపల్లి, తంగెడ, కొత్తగణేశునిపాడు, మాచవరం, బ్రాహ్మణపల్లి, పెదఅగ్రహారం, జానపాడు. ⇒ నరసరావుపేట: నరసరావుపేట పట్టణం, దొండపాడు, పమిడిపాడు. ⇒ సత్తెనపల్లి: పాకాలపాడు, మాదల, తొండపి, చాగంటివారిపాలెం, నార్నెపాడు, గణపవరం, చీమలమర్రి, రూపెనగుండ్ల, గుండ్లపల్లి, కుంకలగుంట, చేజర్ల. ⇒ వినుకొండ: నూజెండ్ల, రెడ్డికొత్తూరు, బొల్లాపల్లి, కొచ్చర్ల, గంటావారిపాలెం. ⇒ పెదకూరపాడు: ఎర్రబాలెం, లగడపాడు, చండ్రాజుపాలెం, మాదిపాడు. ⇒ చిలకలూరిపేట: అప్పాపురం

Rajasthan win in eliminator
రాయల్స్‌ ముందుకు...చాలెంజర్స్‌ ఇంటికి...

అసాధారణ రీతిలో ఆరు వరుస విజయాలతో ‘ప్లే ఆఫ్స్‌’ వరకు దూసుకొచ్చిన బెంగళూరు ప్రస్థానం ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ముగిసింది. ‘కప్‌ నమ్‌దే’ అంటూ కొత్త ఆశలు రేపిన టీమ్‌ నాకౌట్‌ సమరంలో కుప్పకూలి మరోసారి అభిమానులను నిరాశకు గురి చేసింది. వరుసగా నాలుగు ఓటముల తర్వాత ఎట్టకేలకు అసలు పోరులో తమ స్థాయిని ప్రదర్శించిన రాజస్తాన్‌ రాయల్స్‌ మరో అడుగు ముందుకేసి రెండో క్వాలిఫయర్‌లో సన్‌రైజర్స్‌తో సమరానికి సిద్ధమైంది. ముందుగా పదునైన బౌలింగ్‌తో బెంగళూరును కట్టిపడేసిన రాజస్తాన్‌ ఆ తర్వాత సాధారణ లక్ష్యాన్ని ఆరు బంతుల ముందే అందుకుంది. అక్కడక్కడా కాస్త తడబాటు కనిపించినా...ఆఖరికి గెలుపు తీరం చేరింది. 700కుపైగా పరుగులు చేసిన తర్వాత కూడా ఇక్కడే ఆగిపోయిన విరాట్‌ కోహ్లి చిత్రం చూస్తే చాలు ఆర్‌సీబీ దురదృష్టం ఎలాంటిదో చెప్పేందుకు! అహ్మదాబాద్‌: ఐపీఎల్‌ ఫైనల్లో స్థానం కోసం రెండో క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో రాజస్తాన్‌ రాయల్స్‌ తలపడనుంది. బుధవారం జరిగిన ‘ఎలిమినేటర్‌’ మ్యాచ్‌లో రాజస్తాన్‌ 4 వికెట్ల తేడాతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ)పై విజయం సాధించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. రజత్‌ పటిదార్‌ (22 బంతుల్లో 34; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), విరాట్‌ కోహ్లి (24 బంతుల్లో 33; 3 ఫోర్లు, 1 సిక్స్‌), మహిపాల్‌ లోమ్రోర్‌ (17 బంతుల్లో 32; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. అనంతరం రాజస్తాన్‌ 19 ఓవర్లలో 6 వికెట్లకు 174 పరుగులు సాధించి గెలిచింది. యశస్వి జైస్వాల్‌ (30 బంతుల్లో 45; 8 ఫోర్లు), రియాన్‌ పరాగ్‌ (26 బంతుల్లో 36; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. కీలకమైన రెండు వికెట్లు తీసిన అశ్విన్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. దూకుడు లేకుండా... బెంగళూరు ఇన్నింగ్స్‌ ఆరంభం నుంచి తడబడుతూనే సాగింది. కోహ్లి, డుప్లెసిస్‌ ఆశించిన మెరుపు ఆరంభాన్ని ఇవ్వలేకపోయారు. బౌల్ట్‌ తన 3 ఓవర్లలో 6 పరుగులే ఇచ్చి ప్రత్యర్థిని కట్టిపడేశాడు. డుప్లెసిస్, కోహ్లి తక్కువ వ్యవధిలో వెనుదిరిగిన తర్వాత కామెరాన్‌ గ్రీన్‌ (21 బంతుల్లో 27; 2 ఫోర్లు, 1 సిక్స్‌) కొన్ని పరుగులు జోడించాడు. అయితే గ్రీన్, మ్యాక్స్‌వెల్‌ (0)లను వరుస బంతులకు అవుట్‌ చేసి అశ్విన్‌ దెబ్బ కొట్టాడు. ఈ దశలో పటిదార్‌ ఇన్నింగ్స్‌ ఆర్‌సీబీని ముందుకు నడిపించింది. 5 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జురేల్‌ సునాయాస క్యాచ్‌ వదిలేయడంతో బతికిపోయిన పటిదార్‌ కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. చహల్‌ ఓవర్లో అతను 2 సిక్స్‌లు, ఫోర్‌ బాదడంతో స్కోరు వంద పరుగులు దాటింది. తన చివరి ఐపీఎల్‌ ఇన్నింగ్స్‌లో దినేశ్‌ కార్తీక్‌ (11) విఫలం కాగా, చివర్లో లోమ్రోర్‌ ధాటిగా ఆడాడు. రాణించిన జైస్వాల్‌... ఛేదనను జైస్వాల్, టామ్‌ కోలర్‌ (20) జాగ్రత్తగా మొదలు పెడుతూ తొలి 2 ఓవర్లలో 6 పరుగులే చేశారు. అయితే యశ్‌ దయాళ్‌ వేసిన మూడో ఓవర్లో జైస్వాల్‌ 4 ఫోర్లు బాది జోరు మొదలు పెట్టగా, సిరాజ్‌ వేసిన తర్వాతి ఓవర్లో కూడా 3 ఫోర్లు వచ్చాయి. కోలర్‌ వెనుదిరిగిన తర్వాత జైస్వాల్, స్యామ్సన్‌ ఇన్నింగ్స్‌ను నడిపించారు.అయితే వీరిద్దరు ఐదు పరుగుల వ్యవధిలో వెనుదిరగడం, జురేల్‌ (8) రనౌట్‌ కావడంతో కొంత ఉత్కంఠ పెరిగింది. అయితే మరో ఎండ్‌లో పరాగ్‌ ఆకట్టుకునే ఆటతో గెలుపు భారాన్ని తీసుకున్నాడు. పరాగ్, హెట్‌మైర్‌ (14 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్‌) మధ్య 45 పరుగుల భాగస్వామ్యం (25 బంతుల్లో) రాజస్తాన్‌ను విజయం దిశగా తీసుకెళ్లింది. విజయానికి చేరువైన దశలో వీరిద్దరు నిష్క్రమించినా రావ్‌మన్‌ పావెల్‌ (8 బంతుల్లో 16 నాటౌట్‌; 2 ఫోర్లు, 1 సిక్స్‌) పని పూర్తి చేశాడు. స్కోరు వివరాలు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: కోహ్లి (సి) (సబ్‌) ఫెరీరా (బి) చహల్‌ 33; డుప్లెసిస్‌ (సి) పావెల్‌ (బి) బౌల్ట్‌ 17; గ్రీన్‌ (సి) పావెల్‌ (బి) అశ్విన్‌ 27; పటిదార్‌ (సి) పరాగ్‌ (బి) అవేశ్‌ 34; మ్యాక్స్‌వెల్‌ (సి) జురేల్‌ (బి) అశ్విన్‌ 0; లోమ్రోర్‌ (సి) పావెల్‌ (బి) అశ్విన్‌ 32; కార్తీక్‌ (సి) జైస్వాల్‌ (బి) అవేశ్‌ 11; స్వప్నిల్‌ (నాటౌట్‌) 9; కరణ్‌ (సి) పావెల్‌ (బి) సందీప్‌ 5; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 172. వికెట్ల పతనం: 1–37, 2–56, 3–97, 4–97, 5–122, 6–154, 7–159, 8–172. బౌలింగ్‌: బౌల్ట్‌ 4–0–16–1, సందీప్‌ శర్మ 4–0–48–1, అవేశ్‌ ఖాన్‌ 4–0–44–3, అశ్విన్‌ 4–0–19–2, చహల్‌ 4–0–43–1. రాజస్తాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (సి) కార్తీక్‌ (బి) గ్రీన్‌ 45; టామ్‌ కోలర్‌ (బి) ఫెర్గూసన్‌ 20; సామ్సన్‌ (స్టంప్డ్‌) కార్తీక్‌ (బి) కరణ్‌ 17; పరాగ్‌ (సి) సిరాజ్‌ 36; జురేల్‌ (రనౌట్‌) 8; హెట్‌మైర్‌ (సి) డుప్లెసిస్‌ (బి) సిరాజ్‌ 26; పావెల్‌ (నాటౌట్‌) 16; అశ్విన్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (19 ఓవర్లలో 6 వికెట్లకు) 174. వికెట్ల పతనం: 1–46, 2–81, 3–86, 4–112, 5–157, 6–160. బౌలింగ్‌: స్వప్నిల్‌ 2–0–19–0, సిరాజ్‌ 4–0–33–2, దయాళ్‌ 3–0–37–0, ఫెర్గూసన్‌ 4–0–37–1, కరణ్‌ శర్మ 2–0–19–1, గ్రీన్‌ 4–0–28–1.

Atrocity of TDP leaders due to fear of defeat
కుట్ర విఫలం వల్లే రాద్ధాంతం

సాక్షి, అమరావతి: ఏ విధంగా అయినా సరే పోలింగ్‌ రోజు పరిస్థితిని తనకు అనుకూలంగా మలుచుకోవడానికి టీడీపీ తొక్కని అడ్డదారులంటూ లేవు. గూండా­యిజం, దౌర్జన్యం, బెదిరింపులు, రిగ్గింగ్‌.. ఇలా అన్ని విధాలా అక్రమాలకు పాల్పడింది. ఎక్కడైనా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గట్టిగా ప్రతిఘటిస్తే ఈసీ అండతో పోలీసులను అడ్డుపెట్టుకుని ఎదురు దాడులు చేస్తూ.. ‘పచ్చ’ మూక ఎదురు కేసులు పెడుతోంది. నానా యాగీ చేస్తూ రాద్ధాంతం చేస్తోంది. మీ బిడ్డ ప్రభుత్వం వల్ల మీ కుటుంబానికి మంచి జరిగి ఉంటే ‘ఫ్యాన్‌’ గుర్తుపై రెండు బటన్లు నొక్కి.. ఓటు వేసి ఆశీర్వదించాలని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన విజ్ఞప్తికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలు భారీ ఎత్తున స్పందిస్తుండటంతో సార్వత్రిక ఎన్నికల్లో కూటమికి ఘోర పరాజయం ఖాయమని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆందోళనకు గురై ధ్వంస రచనకు తెరలేపారు. పోలింగ్‌ రోజున విధ్వంసం సృష్టించడం ద్వారా మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అగ్రవర్ణ పేదలు ఓట్లు వేసేందుకు బయటకు రాకుండా చేయాలని కుట్ర పన్నా­రు. ఆ కుట్రలో భాగంగానే పోలింగ్‌ రోజు (ఈనెల 13న) ఉదయం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణు­ల­ను గొడవలకు ఉసిగొల్పారు. దీంతో వైఎస్సార్‌సీపీకి ఏకపక్షంగా ఓట్లు పడుతున్న పోలింగ్‌ కేంద్రాల వద్ద టీడీపీ గూండాలు రౌడీయిజానికి దిగారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలు, అగ్రవర్ణ పేదలను ఓటు హక్కు వినియోగించుకోకుండా అడ్డుకున్నారు. కొన్ని చోట్ల ఈవీఎంలను ధ్వంసం చేశారు. టీడీపీ గూండాల దారుణకాండ వెబ్‌ కాస్టింగ్‌లో లైవ్‌లో స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ ఎన్నికల అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పోలీసు ఉన్నతాధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తూ టీడీపీ గూండాల పైశాచికత్వానికి వత్తాసు పలికారు. టీడీపీ రౌడీల అరాచకాలను అడ్డుకుని.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి, జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్, ఎస్పీలకు ఎప్పటికప్పుడు ఫిర్యాదు చేయడానికి ఫోన్‌లు చేసినా, వారు స్పందించలేదు. మాచర్ల నుంచి తాడిపత్రి వరకు అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కనిపించింది. టీడీపీ రౌడీల దారుణకాండ మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం పాల్వాయిగేటు 201, 202 పోలింగ్‌ బూత్‌లలో ఓట్లు వేసేందుకు వచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలపై టీడీపీ గూండాలు దాడులకు దిగారు. ఓటు హక్కును వినియోగించుకోనివ్వకుండా వారిని అడ్డుకున్నారు. ఈ అరాచక పర్వం గురించి ఓటర్లు మాచర్ల నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. పోలింగ్‌ను అడ్డుకుంటున్న టీడీపీ గూండాలపై చర్యలు తీసుకోవాలని ఆ నియోజకవర్గ రిటరి్నంగ్‌ అధికారితోపాటు పల్నాడు జిల్లా కలెక్టర్, ఎస్పీలకు పిన్నెల్లి ఫిర్యాదు చేసేందుకు పదే పదే ఫోన్‌లు చేసినా వారు స్పందించలేదు. దీంతో ఆయా వర్గాల వారికి అండగా నిలిచి.. వారు ఓటు హక్కు వినియోగించుకునేలా చేసేందుకు పిన్నెల్లి పాల్వాయిగేటుకు చేరుకున్నారు. టీడీపీ రౌడీల దారుణకాండను అడ్డుకునే యత్నం చేశారు. తమ కుట్ర విఫలమవడంతో పిన్నెల్లిపై పచ్చమూక దు్రష్ఫచారం చేస్తోంది.బడుగులపై దాడులు.. ఈవీఎంల ధ్వంసం మాచర్ల నియోజకవర్గం కారంపూడి మండలం ఒప్పిచర్లలో పోలింగ్‌ బూత్‌ 251లో ఓటు వేసేందుకు వచ్చిన ఎస్టీ వర్గానికి చెందిన పాలకీర్తి శ్రీనివాసరావుపై టీడీపీ రౌడీలు దాడి చేసి, చితక­బాదారు. భయోత్పాతం సృష్టించడం ద్వారా ఆ పోలింగ్‌ కేంద్రం వద్ద ఓటర్లను బెదర­గొట్టాలని కుట్ర చేశారు. మాచర్ల మండలం తుమ్మురుకోటలోని 203, 204, 205, 206 పోలింగ్‌ బూత్‌లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలు, అగ్రవర్ణ పేదలు ఏకపక్షంగా ఓట్లు వేస్తుం­డటంతో టీడీపీ గూండాలు జీరి్ణంచుకోలేకపోయారు. ఎలాగైనా సరే ఆ ఓట్లను చెల్లకుండా చేయాలనే లక్ష్యంతో పోలింగ్‌ కేంద్రంలోకి చొరబడి ఆ నాలుగు పోలింగ్‌ కేంద్రాల్లో ఈవీఎంలను ధ్వంసం చేశారు. తాడిపత్రిలో పోలింగ్‌ సజావుగా జరగకుండా విఘాతం కల్పించడానికి జేసీ ప్రభాకర్‌రెడ్డి నేతృత్వంలో టీడీపీ గూండాలు కవ్వింపు చర్యలకు దిగుతూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి, కార్యకర్తలపై రాళ్ల దాడికి దిగారు. పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర పోషించారు. జమ్మలమడుగు నవాజ్‌ కట్టలోని 116, 117 పోలింగ్‌ బూత్‌ల వద్ద పోలింగ్‌ను అడ్డుకోవడానికి బీజేపీ అభ్యర్థి ఆదినారాయణరెడ్డి, కడప లోక్‌సభ టీడీపీ అభ్యర్థి భూపే‹Ùరెడ్డి కవ్వింపు చర్యలకు దిగుతూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి సు«దీర్‌రెడ్డిపై రాళ్ల దాడికి దిగారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని తేలప్రోలు జెడ్పీ హైస్కూల్‌లో ఉన్న 271, 273, 274, 275 పోలింగ్‌ కేంద్రాల వద్ద పోలింగ్‌ ప్రక్రియకు విఘాతం కల్పించడానికి టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు నేతృత్వంలోని పచ్చమంద బరితెగించింది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను కవ్విస్తూ దాడికి దిగి భయోత్పాతం సృష్టించింది.

Arogyasree services as usual
యథావిధిగా ఆరోగ్యశ్రీ సేవలు

సాక్షి, అమరావతి: డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం కింద పేద, మధ్య తరగతి రోగులకు యథావిధిగా ఉచిత చికిత్సలు అందుతున్నాయి. పథకం సేవలు నిలిపివేసినట్టు కొన్ని ఆస్పత్రుల యాజమాన్యాలు ప్రకటనలు చేశాయి. కాగా, ఎక్కడా పథకం సేవలు నిలిచిపోలేదని ముఖ్య కార్యనిర్వహణ అధికారి(సీఈవో) డాక్టర్‌ లక్ష్మీషా బుధవారం తెలిపా­రు.ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకం కింద 3,257 ప్రొసీజర్‌లలో నగదు రహిత చికిత్సను అందిస్తున్నట్టు తెలిపారు. ఇలా ప్రతి కుటుంబానికీ వా­ర్షి­క చికి­త్స పరిమితి రూ.25 ల„ý­ ల వరకూ ఉందన్నారు. గత ఆరి్థక సంవత్సరం(2023–24)లో ఆరో­గ్యశ్రీ ట్రస్ట్‌ నుంచి రూ.3,566.­22 కోట్లు నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు జమ చేశారు. బుధవారం ఆరోగ్యశ్రీ ట్ర­స్ట్‌ నుంచి అన్ని ఆస్పత్రులకు రూ.203 కోట్ల బిల్లులు చెల్లించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) మొదటి రెండు నెలల్లోనే రూ.366 కోట్లు చెల్లించినట్లయింది. మిగిలిన బకా­యిలనూ త్వరలోనే విడుదల చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఐదేళ్లలో వైద్య శాఖలో 54 వేల పోస్టుల భర్తీ కొన్ని ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటనలిస్తున్న క్రమంలో పేద, మధ్యతరగతి ప్రజలకు వైద్య సేవల విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని జిల్లా కలెక్టర్‌లకు వైద్య శాఖ ఆదే­శాలిచ్చింది. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకోవాలంది. ఆరోగ్యశ్రీ లబ్ధిదారుల వైద్య సేవలకు అంతరాయం కలిగించే ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అన్ని ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు అసౌకర్యం కలగకుండా చూడాలని సూపరింటెండెంట్లకు సూ­చించింది. గత ఐదేళ్లలో 54 వేల మేర వైద్య శాఖలో పోస్టులు భర్తీ చేశారు. దీంతో ఆస్పత్రుల్లో పూర్తి స్థాయిలో వైద్యులు ఉన్నారు.

Power companies focus on ways to increase revenue in Telangana
వాణిజ్య వడ్డన..! ఆదాయం పెంచుకునే మార్గాలపై విద్యుత్‌ సంస్థల దృష్టి

సాక్షి, హైదరాబాద్‌: నష్టాలు, అప్పుల భారంతో సంక్షోభంలో ఉన్న రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లు ఆదాయం పెంచుకునే మార్గాలపై ఫోకస్‌ చేశాయి. గృహ వినియోగం మినహా.. వాణిజ్య, పారిశ్రామిక, ఇతర కేటగిరీల విద్యుత్‌ చార్జీలను పెంచాలని ప్రాథమికంగా ఆలోచనకు వచ్చినట్టు తెలిసింది. ఈ మేరకు రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి త్వరలో ప్రతిపాదనలను సమర్పించనున్నాయి. జూన్‌ 6వ తేదీతో రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల కోడ్‌ ముగియనుంది. ఆ తర్వాత 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదిక, టారిఫ్‌ ప్రతిపాదనలను డిస్కంలు ఈఆర్సీకి సమర్పించే అవకాశాలు ఉన్నాయి. నిజానికి గత నెల (ఏప్రిల్‌) ఒకటో తేదీ నుంచే రాష్ట్రంలో కొత్త విద్యుత్‌ టారిఫ్‌ అమల్లోకి రావాలి. ఎన్నికలు, ఇతర కారణాలతో డిస్కంలు ప్రతిపాదనలు సమర్పించక పోవడంతో ఉన్న చార్జీలనే కొంతకాలం కొనసాగించేందుకు ఈఆర్సీ అనుమతినిచ్చింది. జనవరి 31 వరకే గడువు ఇచ్చిన ఈఆర్సీ.. విద్యుత్‌ టారిఫ్‌ నిబంధనల ప్రకారం.. డిస్కంలు ఏటా నవంబర్‌ 30వ తేదీలోగా తర్వాతి ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఏఆర్‌ఆర్, కొత్త టారిఫ్‌ ప్రతిపాదనలను ఈఆర్సీకి సమర్పించాలి. తర్వాతి ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని వినియోగదారులకు ఎన్ని మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ సరఫరా చేయాల్సి ఉంటుంది? దానికి ఎంత ఆదాయం అవసరం? ప్రస్తుత విద్యుత్‌ చార్జీలతో వచ్చే ఆదాయం ఎంత? వ్యత్య్సాం (ఆదాయ లోటు) ఎంత? రాష్ట్ర ప్రభుత్వమిచ్చే విద్యుత్‌ సబ్సిడీలు పోగా మిగిలే లోటును భర్తీ చేసేందుకు.. ఎంత మేర విద్యుత్‌ చార్జీలు పెంచాలి? వంటి అంశాలు ఏఆర్‌ఆర్, టారిఫ్‌ ప్రతిపాదనల్లో ఉంటాయి. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే 2024–25 ఆర్థిక సంవత్సర ఏఆర్‌ఆర్, టారిఫ్‌ ప్రతిపాదనలను సిద్ధం చేసినా.. అసెంబ్లీ ఎన్నికలు రావడంతో వాయిదా వేశారు. అప్పట్లో డిస్కంల విజ్ఞప్తి మేరకు ఈ ఏడాది జనవరి 31 వరకు ఈఆర్సీ గడువు పొడిగించింది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం మరో మూడు నెలలు గడువు పొడిగించాలని విజ్ఞప్తి చేసినా.. ఈఆర్సీ తిరస్కరించింది. వెంటనే ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించింది. ప్రస్తుతం ప్రతినెలా రూ1,386 కోట్లలోటు.. డిస్కంల ఆర్థిక నష్టాలు రూ.50,275 కోట్లకు, అప్పులు రూ.59,132 కోట్లకు పెరిగిపోయినట్టు గతంలో విద్యుత్‌పై విడుదల చేసిన శ్వేతపత్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వెల్లడించింది. డిస్కంలు సగటున ప్రతి నెలా రూ.1,386 కోట్ల లోటు ఎదుర్కొంటున్నట్టు పేర్కొంది. కోడ్‌ ముగిస్తే వారికీ ఉచిత విద్యుత్‌.. కాంగ్రెస్‌ ప్రభుత్వం గృహజ్యోతి పథకం కింద రాష్ట్రంలో గృహ వినియోగదారులకు 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్‌ సరఫరాను ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే అప్పటికే స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో.. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించలేదు. ఆ జిల్లాలోని 8 లక్షల గృహ కనెక్షన్లతోపాటు రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా పొందిన విద్యుత్‌ కనెక్షన్లకు ఎన్నికల కోడ్‌ ముగిశాక ఈ పథకాన్ని వర్తింపజేసే అవకాశం ఉంది. ప్రస్తుతం గృహజ్యోతి పథకంతో నెలకు రూ.120 కోట్ల భారం పడుతోందని.. అది రూ.150 కోట్లకు చేరవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. గృహజ్యోతి అమలుకు అనుమతిస్తూ ఈఆర్సీ జారీ చేసిన ఆదేశాల మేరకు... రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెలా ముందస్తుగానే డిస్కంలకు ఈ సబ్సిడీ మొత్తాన్ని చెల్లిస్తోంది. ఓ వైపు 200 యూనిట్లలోపు వినియోగించే వారికి ఉచితంగా విద్యుత్‌ అందిస్తూ.. అంతకు మించి విద్యుత్‌ వినియోగించే వారి బిల్లులను పెంచడం సమంజసం కాదనే భావన అధికారవర్గాల్లో వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే గృహేతర కేటగిరీల విద్యుత్‌ చార్జీలను మాత్రమే పెంచేందుకు ప్రతిపాదనలు సమర్పించాలని నిర్ణయించినట్టు తెలిసింది. పెంచకపోతే సర్కారే భరించాలి! లోక్‌సభ ఎన్నికల కోడ్‌ ముగియనుండటంతో ఏఆర్‌ఆర్, టారిఫ్‌ ప్రతిపాదనలు సమర్పించేందుకు డిస్కంలు ఏర్పాట్లు చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించాక గృహేతర కేటగిరీల విద్యుత్‌ చార్జీలను ఏ మేర పెంచాలనే నిర్ణయం తీసుకోనున్నాయి. డిస్కంల ప్రతిపాదనలపై ఈఆర్సీ అభ్యంతరాలను స్వీకరించడంతోపాటు హైదరాబాద్, వరంగల్‌లలో బహిరంగ విచారణ నిర్వహిస్తుంది. తర్వాత కొత్త టారిఫ్‌ను ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుంది. వినియోగదారుల కేటగిరీల వారీగా పెరిగిన/తగ్గిన విద్యుత్‌ చార్జీల వివరాలు అందులో ఉంటాయి. ఒకవేళ చార్జీల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే.. డిస్కంల ఆదాయ లోటును ప్రభుత్వమే విద్యుత్‌ సబ్సిడీల రూపంలో పూర్తిగా చెల్లించాల్సి ఉంటుంది. ఇదే జరిగితే ఎలాంటి చార్జీల పెంపు లేకుండానే కొత్త టారిఫ్‌ ఆర్డర్‌ను ఈఆర్సీ ప్రకటిస్తుంది.

Low pressure in Southwest Bay of Bengal
నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం!

సాక్షి, విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతంలో బుధవారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. ఇది ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాలకు ఆనుకుని ఉంది. ఈ అల్పపీడనం ఈశాన్య దిశగా కదులుతూ శుక్రవారం ఉదయానికి మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడనుంది. అనంతరం ఈ వాయుగుండం అదే దిశలో పయనిస్తూ 25 సాయంత్రం ఈశాన్య బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న వాయవ్య బంగాళాఖాతంలోకి చేరుకోనుంది. ఆపై అది తుపానుగా మారే అవకాశం ఉంది. మధ్య బంగాళాఖాతం నుంచి దారి మళ్లి బంగ్లాదేశ్‌ వైపు కదిలే అవకాశం ఉన్నందున దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై నామమాత్రంగానే ఉండనుంది. ఫలితంగా రానున్న నాలుగు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేందుకు ఆస్కారం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) బుధవారం రాత్రి నివేదికలో తెలిపింది. గురువారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోనూ, శుక్రవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లోనూ, శనివారం శ్రీకాకుళం, విజయ­నగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకి­నాడ, కోన­సీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూ­లు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలిక­పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉం­దని ఐఎండీ వివరించింది. అల్పపీడ­నం, వా­యు­గుండాల ప్రభావంతో రానున్న ఐదు రోజు­లు కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 30–40 కి.మీల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, సముద్రం అలజడిగా మారుతుందని, అందువల్ల మత్స్యకా­రులు చేపలవేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. నేడు 26 మండలాల్లో వడగాడ్పులు..రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగు­తు­న్నాయి. ఫలితంగా మళ్లీ అక్కడక్కడ వడగా­డ్పులు వీయనున్నాయి. గురువారం శ్రీకాకు­ళం జిల్లాలో 9, విజయనగరం 5, పార్వతీ­పురం మన్యం 11, అల్లూరి సీతారామరాజు 1 (కూనవరం) వెరసి 26 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే శుక్రవారం శ్రీకాకుళం జిల్లాలో 5, విజయ­నగరం 5, పార్వతీపురం మన్యం 7 మండ­లాల్లోనూ వడగాడ్పులు వీస్తాయని పేర్కొంది.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement