ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు హైదరాబాద్ తానే కట్టానని సిగ్గులేకుండా చెబుతున్నారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని విమర్శించారు. సంక్రాంతి పండుగకు వచ్చిన కొత్త హరిదాసు చంద్రబాబంటూ ఎద్దేవా చేశారు. సోమవారం మూడు రాజధానులకు మద్దతుగా రవాణా శాఖ మంత్రి పేర్నినాని ఆధ్వర్యంలో మచిలీపట్నంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మంత్రి కొడాలి నానితో పాటు ఎమ్మెల్యేలు కైలే అనిల్ కుమార్, సింహాద్రి రమేష్ బాబులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. జిల్లా కోర్టు సెంటర్ వద్ద నుండి కోనేరు సెంటర్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. ‘‘ లక్షల కోట్లు ఖర్చు పెడితే ఒక్క ప్రాంతమే అభివృద్ధి చెందుతుంది.