దేశ రాజధానిలో ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఆప్ పార్టీ తరఫున తూర్పు ఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆతిషి విలేకరుల సమావేశంలో కన్నీటి పర్యంతమయ్యారు. ఇంతకు విషయం ఏంటంటే.. ఎవరో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆతిషి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఉన్న పాంప్లెట్లు పంచారు. అయితే ఈ పాంప్లెట్ల వెనక బీజేపీ ఎంపీ అభ్యర్థి, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఉన్నట్లు ఆప్ నాయకులు ఆరోపిస్తున్నారు.