మంచి పనులు చేయడానికి వయసు అవసరం లేదని, పెద్ద మనసుంటే చాలని.. అది ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఉందని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఏకకాలంలో నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించిన ఘనత సీఎం జగన్‌దని కొనియాడారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు యువతను నిండా ముంచారని మండిపడ్డారు. బాబు వస్తే జాబు ఇస్తానంటూ మయామాటలు చెప్పారని ఆగ్రహించారు.