ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు అప్పు ఇవ్వడం అంటే.. విజయ్ మాల్యాకు బ్యాంకులు అప్పు ఇచ్చినట్లేనని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చార్మినార్ బ్యాంక్, కేశవ రెడ్డి, అగ్రిగోల్డ్ సంస్థల్లా చంద్రబాబు కూడా బోర్డు తిప్పేయగలరని మండిపడ్డారు.