దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’నిందితుల ఎన్‌కౌంటర్ కేసుపై విచారణకు ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)తో రాచకొండ సీపీ మహేశ్ భగవత్ సోమవారం భేటీ అయ్యారు. చటాన్‌పల్లిలో ఎన్‌కౌంటర్ ఘటనా స్థలానికి సిట్ బృందం మంగళవారం వెళ్లనుంది. మొత్తం మూడు దశల్లో విచారణ జరపనున్న సిట్.. ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న అధికారులను ప్రశ్నించనుంది. ఈ ఎన్‌కౌంటర్‌కు దారితీసిన పరిణామాలు, దిశ కేసులో పోలీసులు సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తున్న సమయంలో ఏం జరిగిందనే దానిపై వివరాలు సేకరించనున్నారు. ఎన్‌కౌంటర్ జరిగిన తర్వాత సంఘటనా స్థలంలో ఆధారాలు సేకరించిన అధికారులతోపాటు.. ఘటనాస్థలిలో పంచనామా చేసిన అధికారులను సైతం సిట్ విచారించనుంది.ఈ ఘటనపై షాద్‌నగర్ పోలీసులు నమోదుచేసిన ఎఫ్ఐఆర్‌ను సిట్ పరిశీలించనుంది. అలాగే ఘటన తర్వాత సంఘటనా స్థలంలో పోలీసులు సేకరించిన వస్తువులను పరిశీలించనుంది.