దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందుతూ నూతన రికార్డులు సృష్టిస్తోందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ ఎద్దేవా చేశారు. శనివారం విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె పాల్గొన్నారు. నొట్ల రద్దు కారణంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా 20 లక్షల మంది ఉపాధి కోల్పోయారని మండిపడ్డారు.