అవకాశవాద పొత్తులకు టీడీపీ మళ్లీ తెరలేపింది. టీఆర్‌ఎస్ ఓటమే లక్ష్యమని చెబుతూ తెలంగాణలో పార్టీని బతికించుకునేందుకు బద్ధవిరోధి కాంగ్రెస్‌తో పొత్తుకూ బరితెగించింది. కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్‌ఎస్ సర్కార్‌ను గద్దె దించడమే లక్ష్యంగా చేతులు కలిపామని విపక్షాలు ప్రకటించాయి. కేసీఆర్ ఓటమే లక్ష్యంగా మహాకూటమిగా ముందుకెళతామని కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ స్పష్టం చేశాయి.