తన భార్యపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన కామెంట్లు చేసినందుకు ఓ యువకున్ని పోలీస్ స్టేషన్‌లోనే చితకబాదాడు పశ్చిమబెంగాల్‌కి చెందిన ఐఏఎస్ అధికారి. యువకుడు క్షమించమని వేడుకున్నా పట్టించుకోకుండా చితక్కొట్టారు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..అలీపూర్‌ద్వార్ జిల్లాకు చెందిన ఐఏఎస్ అధికారి నిఖిల్ నిర్మల్ భార్యపై అదే ప్రాంతానికి చెందిన వినోద్ కుమార్ సర్కార్ అనే యువకుడు సోషల్ మీడియాలో అసభ్యకర కామెంట్లు చేశాడు.