అనతి కాలంలోనే ఆక్వా రంగంలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నాయకుడు, రాజధాని నిర్మాణ కమిటీ సభ్యుడు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర సోదరుడు బీద మస్తాన్‌రావు ఇల్లు, వ్యాపార సంస్థలపై ఆదాయ పన్నుల శాఖ అధికారులు గురువారం ఆకస్మిక దాడులు చేశారు. చెన్నైలోని ఆయన నివాసగృహం, కార్పొరేట్ కార్యాలయం, నెల్లూరులోని కార్యాలయం, కావలి సమీపంలో విమానాశ్రయ భూముల వద్ద ఉన్న (దామవరం) రొయ్యల మేత ఫ్యాక్టరీ, రొయ్యలు విదేశాలకు ఎగుమతి చేసే ప్రాసెసింగ్ ప్లాంట్లపై ఐటీ అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు.