రాజధానిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టమైన వైఖరి చెప్పారని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు తెలిపారు. ఆయన బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ ‘రాజధాని విషయంలో మసిపూసి మారేడుకాయ చేయాల్సిన అవసరం లేనది ముఖ్యమంత్రి అభిప్రాయం. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని సీఎం స్పష్టం చేశారు. వికేంద్రీకరణ జరిగితే తప్పేంటి? వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిని సీఎం జగన్ ఉద‍్దేశం. గత అయిదేళఉ విభజన చట్టంలోని హామీలను సాధించుకోలేకపోయాం. హైకోర్టు ఒకచోట... రాజధాని మరోచోట ఉన్న రాష్ట్రాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో అయితే హైకోర్టు అహ్మదాబాద్‌లో ఉంది.