కడప ఉక్కు ఫ్యాక్టరీ సాధన కోసం ఈ నెల 29న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బంద్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు వైఎస్సార్ సీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి గురువారం ప్రొద్దుటూరులో ప్రకటన చేశారు. ఉక్కు ఫ్యాక్టరీ సాధన కోసం ఈ నెల 23న కడప, 24న బద్వేల్, 25న రాజంపేటల్లో వైఎస్సార్ సీపీ ధర్నాలు చేస్తుందని వెల్లడించారు.