పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను టీడీపీ మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు తోసిపుచ్చారు. తాము ఏ పార్టీలోకి వెళ్లడం లేదని, బీజేపీలోకి వెళుతున్నామన్నట్లు వస్తున్న వార్తలలో వాస్తవం లేదని ఆయన చెప్పుకొచ్చారు. కాగా టీడీపీకి చెందిన కాపు నాయకులంతా గురువారం కాకినాడలోని ఓ ప్రయివేట్ హోటల్‌లో సమావేశం అయ్యారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మీసాల గీత, వరుపుల రాజా, బొండా ఉమా, బడేటి బుజ్జి, పంచకర్ల రమేష్ బాబు, కదిరి బాబూరావు, ఈలి నాని, జ్యోతుల నెహ్రు, కేఏ నాయుడు, వేదవ్యాస్, చెంగల్రాయుడు, బండారు మాధవ నాయుడు తదితరులు హాజరయ్యారు. దాదాపు 20మంది మాజీ ఎమ్మెల్యేలు... పార్టీలో తమ భవిష్యత్, రాజకీయ పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నట్లు సమాచారం.