దేశ రాజకీయాల్లో కొత్త రాజకీయ కూటమి ఏర్పాటు కోసం తాను ప్రయత్నిస్తున్నానని తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు చేసిన ప్రకటన జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. జాతీయ రాజకీయాల్లో థర్డ్ ఫ్రంట్ లేదా మరో ఫ్రంట్ ఏర్పాటుకు తాను ప్రయత్నాలు ఆరంభించానని కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ ఆదివారం సీఎం కేసీఆర్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. థర్డ్ ఫ్రంట్ ప్రకటన నేపథ్యంలో ఆమె కేసీఆర్‌కు ఫోన్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ‘దేశ రాజకీయాల్లో మార్పు రావాలి. ఇందుకోసం మేం మీతో కలిసి ఉంటాం’ అని మమత కేసీఆర్‌కు భరోసా ఇచ్చినట్టు తెలుస్తోంది.