పేద పిల్లలకు బంగారు భవిష్యత్ అందిచడానికే ఆంగ్ల మాద్యమాన్ని ప్రవేశపెడుతున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. ఇంగ్లీష్ మీడియం అంశాన్ని రాజకీయాల కోసం వాడుకోవద్దని ప్రతిపక్ష పార్టీల నాయకులకు హితవు పలికారు. నేటి ఆధునిక సమాజంలో ఇంగ్లీష్ మీడియం చాలా అవసరమని ఆయన వ్యాఖ్యానించారు.