‘ఆలీబాబా 40 దొంగలు అన్నట్లు జానాబాబా 40 దొంగలుగా కాంగ్రెస్ నేతలు సిగ్గు, ఎగ్గు లేకుండా బస్సు యాత్ర చేస్తున్నారు. యాత్ర చేస్తున్న వారందరిపై కేసులున్నాయి.’అని రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా పర్యటనలో భాగంగా నూతనకల్ మండలం చిల్పకుంట్లలో రూ.143 కోట్లతో నిర్మించిన మిషన్ భగీరథ వాటర్ ప్లాంట్‌కు ఆయన ప్రారంభోత్సవం చేసి 175 గ్రామాలకు మంచి నీటిని విడుదల చేశారు.