అమృతలూరుకు చెందిన తెలుగుదేశం నేత నాగేశ్వర రావు కుమారుడు విష్ణుతేజ, మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం బయటకు పొక్కడంతో కేసు పెట్టొద్దంటూ డబ్బు ఎరగా చూసి రాజీ చేసుకున్నారు. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో రూరల్ ఎస్పీ అప్పలనాయుడు జోక్యంతో స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం తెనాలీ డీఎస్పీ స్నేహిత, విష్ణుతేజను అదుపులోకి తీసుకున్నారు. గతంలో నాగేశ్వర రావు కూచిపూడి నీటిసంఘం అధ్యక్షుడిగా పనిచేశారు.