టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తనయుడు లోకేష్ అవినీతికి పాల్పడుతున్నారని, ఐటీ దాడుల్లో దొరికిపోయిన శేఖర్‌రెడ్డితో ఆయనకు సంబంధాలు ఉన్నాయని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఎన్డీటీవీతో మాట్లాడిన పవన్ కల్యాణ్.. లోకేశ్ అవినీతి వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. లోకేశ్‌పై తాను చేసిన వ్యాఖ్యలకు ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఏ ఆధారాలు లేకుండా లోకేశ్ గురించి ఎందుకు మాట్లాడుతానని పవన్ ప్రశ్నించారు. సరైన సమయం వచ్చినప్పుడు ఆధారాలు బయటపెడతానని వెల్లడించారు.