అధికార పార్టీ టీడీపీ, ఆ పార్టీకి కొమ్ముకాస్తూ.. ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్న ఒక వర్గం మీడియాపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ వరుస ట్వీట్లతో సంచలనం రేపుతున్నారు. ఎదుటివారిపై దాడి చేయడమే టీడీపీ సిద్ధాంతమని, దేవుడిని నమ్ముతామని అమెరికా రాజ్యాంగ పీఠికలో చెప్పుకుంటే.. ఎదుటివారిపై దాడే మార్గమని టీడీపీ పీఠికలో ఉందని పవన్ ఎద్దేవా చేశారు. టీడీపీలో ఈ సిద్ధాంతానికి రూపకర్త బూతుజ్యోతిరత్న ‘ఆర్కే’నే అంటూ నిప్పులు చెరిగారు.