వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జోగి రమేశ్‌పై అక్రమ కేసులకు వ్యతిరేకంగా ఆ పార్టీ కార్యకర్తలు అరండల్‌పేట పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు వారితో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మీడియాతో మాట్లాడుతున్న వైఎస్సార్ సీపీ నేతల పట్ల అడిషనల్ ఎస్పీ వైటీ నాయుడు దురుసుగా ప్రవర్తించారు. పోలీసు స్టేషన్ ఎదుట మీడియాతో మాట్లాడుతున్న వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ముస్తఫాను అడిషనల్ ఎస్పీ వైటీ నాయుడు నెట్టివేసారు. స్టేషన్ ఎదుట మాట్లాడటానికి వీల్లేదంటూ హుకుం జారీచేశారు. వైటీ నాయుడు వైఖరిపై ముస్తఫా, రావి వెంకటరమణ ఆగ్రహం వ్యక్తం చేశారు.