‘‘నేను దాదాపు 28ఏళ్లు పల్లెటూర్లోనే పెరగడంతో పల్లెతో మంచి అనుబంధం ఏర్పడింది. ‘రంగస్థలం’ సినిమా చేయడం వల్ల నా అనుబంధాన్ని మళ్లీ వెతుక్కున్నట్లు అయ్యింది’’ అని దర్శకుడు సుకుమార్ అన్నారు. రామ్‌చరణ్, సమంత జంటగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్, యలమంచిలి రవిశంకర్, సి.వి.ఎం (మోహన్) నిర్మించిన ‘రంగస్థలం’ ఈ నెల 30న విడుదలవుతోంది.