రాష్ట్రంలో టీటీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఆయన మంగళవారం ఢిల్లీలో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ అయినట్లు తెలుస్తోంది. రేవంత్‌తో పాటు మరో ఎమ్మెల్యే, 20 మందికిపైగా నేతలు కూడా కాంగ్రెస్‌లో చేరనున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల నాటికి టీఆర్‌ఎస్‌తో టీటీడీపీ పొత్తు పెట్టుకునే దిశగా అడుగులు పడుతున్నాయన్న అసంతృప్తి నేపథ్యంలో రేవంత్ పార్టీని వీడుతున్నట్లు ఆయన సన్నిహితవర్గాలు చెబుతున్నాయి. అయితే రాహుల్‌తో భేటీ అంశాన్ని, కాంగ్రెస్‌లో చేరిక వార్తలను రేవంత్‌రెడ్డి ఖండించారు.