కేంద్ర సాయంపై బహిరంగ చర్చ సిద్ధమని సీఎం చంద్రబాబు చేసిన సవాల్‌పై బీజేపీ నాయకుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు స్పందించారు. టీడీపీతో బహిరంగ చర్చకు సిద్ధమేనని ఆయన ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎప్పుడు చేయనంత సాయం కేంద్రం చేస్తోందని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబును పిలిస్తే లెక్కలన్నీ చెబుతారన్నారు. హరిబాబు సినిమా స్క్రిప్టులు చదువుతారంటూ విమర్శిస్తున్నారని, ఆ అలవాటు మాది కాదు మీదంటూ టీడీపీ నాయకులపై మండిపడ్డారు. అమరావతితో పాటు విజయవాడ అభివృద్ధికి కేంద్రం ఎన్నో నిధులిచ్చిందన్నారు.