యువతను చంద్రబాబు ప్రభుత్వం మోసగిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం విమర్శించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నిరుద్యోగ భృతిపై చంద్రబాబు ప్రభుత్వం ఆంక్షలు విధించిందని ఆరోపించారు. నిరుద్యోగ భృతి రూ. 2 వేలు ఇస్తామని చెప్పి, వెయ్యి రూపాయలకు తగ్గించారని తెలిపారు. ఇది న్యాయమా.. రాష్ట్రంలో అనేక మంది విద్యార్ధులు ఉద్యోగ, ఉపాధి లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యువతను నిర్వీర్యం చేస్తే నవనిర్మాణం సాధ్యమా అని ప్రశ్నించారు. చంద్రబాబుది నవనిర్మాణ దీక్ష కాదు.. శవ నిర్మాణదీక్ష.