తెలుగుదేశం పార్టీ నాయకుల ఆగడాలు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయి. మండల పరిధిలోని కాగితాపల్లి గ్రామానికి చెందిన గ్రామ వలంటీర్ కిమిడి గౌరునాయుడు మంగళవారం రేషన్ సరుకులు తీసుకున్న ప్రతి లబ్ధిదారుని వేలిముద్రను తీసుకొని బియ్యానికి సంబంధించి డబ్బులు వసూలు చేసే కార్యక్రమం చేపడుతున్నారు. విధుల్లో భాగంగా ఉద యం 7.30 గంటల సమయంలో దూబ నాగమణికి సంబంధించిన ఇంటితోపాటు మరికొన్ని ఇళ్లకు వేలిముద్రలు వేయించేందుకు వెళ్లారు. ఇంతలో డీసీసీబీ ఉపాధ్యక్షుడు, టీడీపీ నాయకుడు దూబ ధర్మారావు సోదరుడు దూబ అప్పలనాయుడుతోపాటు దూబ పాపారావు, కిమిడి నీలకంఠం, కిమిడి రమేష్, దూబ సూరపునాయుడులు వచ్చి దుర్భాషలాడుతూ దాడికిపాల్పడ్డారని గౌరునాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.