ఎన్నికల ప్రచారంలో టీడీపీ నేతలు హద్దుమీరుతున్నారు. ప్రజలు భయాందోళనకు గురయ్యేలా బరితెగింపు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు తాము ఎంతటికైనా వెనకడామని స్పష్టం చేస్తున్నారు. ప్రకాశం జిల్లా ఎన్నికల ప్రచారంలో భాగంగా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే దివి శివరామ్ తన మనసులోని మాటను బయటపెట్టారు.