ఆయన ఓ ప్రజా ప్రతినిధి. ప్రజల కోసం పని చేయాల్సిన వ్యక్తి. చెప్పే ప్రతి మాట, వేసే ప్రతి అడుగులో ఆదర్శం, విలువలు చూపించాల్సిన మనిషి. కానీ మన జిల్లా ప్రజా ప్రతినిధి మాత్రం ఆదర్శాలను గాలికి వదిలేశారు. కేవలం నచ్చిన రాజకీయ పార్టీని ఎంచుకున్నాడనే కక్షతో ఓ సామాన్యుడిపై విరుచుకుపడ్డారు. రాయలేని భాషను ఉపయోగిస్తూ బెదిరింపులకు తెగబడ్డారు. ఆమదాలవలస ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కూన రవికుమార్ దిగజారుడు రాజకీయాలకు పాల్ప డ్డారు. ఎమ్మెల్యే స్థాయికి తగని మాటలతో విలువలకు నిలువునా పాతరేశారు. గంగిరెడ్ల శివ వైఎస్సార్ సీపీ కార్యకర్తతో ఫోన్‌లో మాట్లాడుతూ తన పార్టీ జెండా పట్టుకోకుంటే వెంటాడివేటాడుతానని బెదిరించారు. ఆ ఫోన్ సంభాషణ సాగిందిలా..