ఎన్నికల వేళ టీఆర్‌ఎస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చేవెళ్ల లోక్‌సభ సభ్యుడు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని మంగళవారం పార్టీ అధినేత కేసీఆర్‌కు పంపారు. తాను పార్టీని వీడేందుకు దారితీసిన కారణాలను తెలియజేస్తూ కేసీఆర్‌కు మూడు పేజీల లేఖ రాశారు. రాజకీయాల్లోకి రావడం తన కుటుంబ సభ్యులకు ఇష్టం లేనప్పటికీ అప్పటి అవసరానికి అనుగుణంగా తానుటీఆర్‌ఎస్‌లో చేరానని, క్రమంగా పార్టీలోని పరిస్థితులు తనను ఇబ్బందు లకు గురిచేశాయని, మరీ ముఖ్యంగా గత రెండేళ్లుగా జరుగుతున్న పరిణామాలు తనను మనస్తాపానికి గురిచేశాయని తెలిపారు.