ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నవనిర్మాణ దీక్షలు కేవలం అట్టహాస ఏర్పాట్లకు మాత్రమే పరిమితం అయ్యాయి. జనాలు లేక దీక్షా ప్రాంగణాలు వెలవెలపోతున్నాయి. దీక్షలో జనాలు లేకపోవడంతో తెలుగుదేశం పార్టీ నేతలు మొక్కుబడిగా దీక్షలో కుర్చీలకు ఉపన్యాసాలు ఇస్తున్నట్లు అక్కడి పరిస్థితులు కనిపిస్తున్నాయి.