అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటనకు ముందు దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం ఉదయం సీఏఏ మద్దతుదారులు, వ్యతిరేకుల మధ్య ఘర్షణకు దారితీయడంతో ఉద్రిక్తత నెలకొంది. ఢిల్లీలోని మౌజ్‌పూర్‌లో సీఏఏకు అనుకూలంగా, వ్యతిరేకంగా ఇరు వర్గాలు నినాదాలు చేస్తూ రాళ్లు రువ్వుకోవడంతో పోలీసులు భాష్పవాయు గోళాలను ప్రయోగించి అల్లరి మూకలను చెదరగొట్టారు. దుండగులు కొన్ని ఇళ్లపైన కూడా రాళ్లు రువ్వారు.