ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో లోక్‌సభ, శాసనసభ స్థానాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ దాదాపుగా పూర్తి కావడంతో తొలి విడత అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. బుధవారం ఉదయం 10 గంటల తర్వాత ఎప్పుడైనా జాబితాను ప్రకటించే అవకాశం ఉందని పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. మొత్తం 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాలకు గాను తొలి విడతలో సగానికి పైగా అభ్యర్థులను ప్రకటించాలని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించినట్లు తెలిసింది.