జిల్లాలోని జమ్మిలవారిపల్లి పెట్రోల్ బంక్ వద్ద వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అడుగుపెట్టగానే ప్రజాసంకల్పయాత్ర 700 కిలోమీటర్లకు చేరుకుంది. ఆ ప్రాంతంలో గుర్తుగా జగన్ మొక్కను నాటి నీళ్లు పోశారు. ప్రజలు దారిపోడవునా బంతిపూలు పరిచి నడిపించారు. అక్కడే వైఎస్‌ఆర్‌సీపీ జెండాను ఆవిష్కరించారు. జగన్‌ను చూసేందుకు భారీగా మహిళలు తరలివచ్చారు. 50 వరోజు పాదయాత్ర మదనపల్లి, పీలేరు నియోజకవర్గాల్లో సాగింది. పాదయాత్ర దిగ్విజయంగా జరగాలని ప్రజలు ప్రత్యేక పూజలు చేశారు.