ఆంధ్రప్రదేశ్‌కు కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం రాత్రి 7.40 గంటల ప్రాంతంలో తిరుమలకు చేరుకున్నారు. తిరుమలలో ఆయనకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. జననేతకు శాలువా కప్పి సత్కరించారు. ఇక, తిరుమలలో వైఎస్ జగన్‌కు టీటీడీ ఈవో అనీల్‌కుమార్ సింఘాల్, చిత్తూరు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న సాదరంగా స్వాగతం పలికారు. వైఎస్ జగన్ వెంట పార్టీ నేతలు విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, నారాయణస్వామి, అనీల్ యాదవ్ తదితరులు ఉన్నారు.