ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ముస్లింల సంక్షేమం కోసం అనేక హామీలిచ్చి వాటన్నింటినీ తుంగలో తొక్కారని వైఎస్సార్‌సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి విమర్శించారు. దేశంలో ముస్లింలకు ప్రాతినిధ్యం లేని క్యాబినెట్ ఏదైనా ఉందంటే అది కేవలం చంద్రబాబు ప్రభుత్వమేనని మండిపడ్డారు. వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో భాగంగా బుధవారం విశాఖపట్నంలోని ఆరిలోవ బీఆర్‌టీఎస్ రోడ్డులో ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమావేశం జరిగింది.