అమ్మకు అన్నం పెట్టడు గానీ చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్న చందంగా.. ఐదేళ్లుగా ప్రజలను పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు మరోసారి దగా చేయడానికి అవకాశం ఇవ్వాలని కోరడం విడ్డూరంగా ఉందని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సోదరి షర్మిల ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు ఎంగిలి చెయ్యి విదిలిస్తే సరిపోదని.. అన్ని వర్గాల ప్రజలు చంద్రబాబుకు ఓటుతో బుద్ధి చెప్పాలని విఙ్ఞప్తి చేశారు.