టీడీపీ ఎంపీలు రాజీనామా చేసి రాజకీయ సంక్షోభం సృష్టించాలని, ఏపీలో ఉన్న 25 మంది ఎంపీలు రాజీనామా చేసి నిరాహార దీక్ష చేస్తే కచ్చితంగా ప్రత్యేక హోదా వస్తుందని వైఎస్సార్‌సీపీ నేత మల్లాది విష్ణు ఆశాభావం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ నేత పైలా సోమినాయుడితో కలిసి సోమవారం విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేక హోదా ఉద్యమంలో టీడీపీ కూడా భాగస్వామి కావాలని అన్నారు.