ఆంధ్రప‍్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక హోదా కోసం ఇంకా ఎంత మంది ప్రాణాలు తీసుకుంటారంటూ ప్రభుత్వంపై వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు. గతంలో ఏపీ హోదా కోరుతూ మునికోటి అనే యువకుడు ఆత్మహత్య చేసుకుంటే, ఆ కుటుంబాన్ని ఇప్పటివరకూ ప్రభుత్వం ఆదుకోలేదనే విషయాన్ని రోజా ఈ సందర్భంగా ప్రస్తావించారు.