sucides
-
కౌన్సెలింగ్ తర్వాతే క్లాసులు..
సాక్షి, హైదరాబాద్: జాతీయ విద్యాసంస్థల్లో విద్యార్థుల బలవన్మరణాలను కట్టడిచేసేందుకు కేంద్ర విద్యాశాఖ నడుం బిగించింది. జాతీయ ఇంజనీరింగ్, మెడికల్, ఇతర ఉన్నత విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థుల మానసిక ఒత్తిడిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్ణయించింది. కాలేజీలు మొదలయ్యే ముందే విద్యార్థులకు విద్యా విధానం, ఎదురయ్యే ఇబ్బందులు, వాటిని అధిగమించడంపై అవగాహన కల్పించాలని భావించింది. ఇందులోభాగంగా కొత్తగా చేరే విద్యార్థులకు ప్రత్యేక కౌన్సెలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని దేశంలోని అన్ని ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఎంలు, కేంద్ర విశ్వవిద్యాలయాలు, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కేంద్రాలు (ఐఐఎస్ఈఆర్), ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (ఎయిమ్స్)లను ఆదేశించింది. ఈ సంస్థల్లో 2018 నుంచి 2022 వరకు జరిగిన విద్యార్థుల ఆత్మహత్యలు, వాటి కారణాలపై కేంద్రం అధ్యయనం చేసింది. ఐఐటీల్లో పెరుగుతున్న ఆత్మహత్యలు గత ఐదేళ్లలో ఐఐటీల్లో 32 మంది, ఎన్ఐటీల్లో 21 మంది, కేంద్ర విశ్వవిద్యాలయాల్లో 20 మంది, ఎయిమ్స్ సంస్థల్లో 11 మంది విద్యార్థులు అర్ధంతరంగా తనువు చాలించారు. జాతీయ స్థాయిలో తీవ్ర పోటీని తట్టుకుని సీట్లు తెచ్చుకున్న ఈ విద్యార్థులు మానసిక ఒత్తిడి, అనుకోకుండా డిప్రెషన్లోకి వెళ్లిపోవడం ఈ పరిస్థితికి కారణమని తెలుస్తోంది. జాతీయ కాలేజీల్లో చేరిన రెండో సంవత్సరం నుంచి వారికి తెలియకుండానే మానసిక ఒత్తిడి మొదలవుతోందని నిపుణులు చెబుతున్నారు. మొదటి ఏడాదిలో మిగిలిపోయే బ్యాక్‌లాగ్స్‌తో ఒక్కసారిగా బెంబేలెత్తిపోతున్నారని, కోర్సు ముగిశాక అనుకున్న రీతిలో జీవితంలో స్థిరపడలేమనే నైరాశ్యం వారిలో గూడుకట్టుకుంటోందని జాతీయ ఇంజనీరింగ్ సంస్థల డైరెక్టర్లు అభిప్రాయపడుతున్నారు. బట్టీ విధానమే కారణమా? ప్రతీ రాష్ట్రంలోనూ ఇంటర్మీడియెట్ వరకు కాలేజీల్లో బట్టీ విధానంలోనే బోధన సాగుతోందని నిపుణులు అంటున్నారు. జాతీయ పోటీ పరీక్షలైన జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్, నీట్ కోసం కోచింగ్ కేంద్రాలు ఒక తరహా బట్టీ పద్ధతిలోనే బోధన చేస్తున్నాయని చెబుతున్నారు. ఇది అసలైన మేధో విధానం కాకపోవడం, ఇంజనీరింగ్‌లో చేరిన తర్వాత ఇదే పద్ధతి ఉండకపోవడం సమస్యకు మూలంగా పేర్కొంటున్నారు. ఆత్మహత్యల నేపథ్యాన్ని పరిశీలిస్తే గణితం, ఫిజిక్స్ ప్రామాణికంగా ఉండే సబ్జెక్టుల్లోనే విద్యార్థులు వెనుకబడుతున్నారు. ఐఐటీలు, ఎన్ఐటీలు పూర్తిగా పరిశోధనాత్మకంగా ఉండాలని జాతీయ విద్యావిధానం చెబుతోంది. మేథ్స్‌లో ఏదైనా సమస్యను విశ్లేషణాత్మకంగా పరిష్కరించే విధానం జాతీయ సాంకేతిక విద్యలో ఇప్పుడు కీలకమైంది. బట్టీ విధానంలో వచ్చిన విద్యార్థులు ఇక్కడే గందరగోళానికి గురవుతున్నారని నిపుణులు విశ్లేíÙస్తున్నారు. ఏ మాత్రం ధైర్యం కోల్పోతున్నా... ఉమ్మడి సీట్ల కేటాయింపునకు సంబంధించిన ఆరు దశల ‘జోసా’కౌన్సెలింగ్ పూర్తయింది. మరికొద్ది రోజుల్లో ఎన్ఐటీలు, ఐఐటీల్లో క్లాసులు మొదలవుతాయి. అందువల్ల ముందుగా ప్రతీ బ్రాంచీలోని విద్యార్థులను సమైక్య పర్చాలి. వారిలో ఉత్తేజాన్ని, మనోధైర్యాన్ని కల్పించేలా కౌన్సెలింగ్ నిర్వహించాలి. సమస్యలకు పరిష్కారం సాధించే మార్గాలను ముందే వివరించాలి. ప్రతీ విద్యార్థి వ్యక్తిగత నేపథ్యం, వారి కుటుంబ వివరాలు తెలుసుకోవాలి. కొన్ని రోజులు విద్యార్థులను దగ్గర్నుంచి పరిశీలించాలి. ఏమాత్రం ధైర్యం కోల్పోతున్నట్టు గుర్తించినా అతన్ని ప్రత్యేక పద్ధతిలో కౌన్సెలింగ్ చేయాలి. ఈ దిశగా అన్ని కాలేజీలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కేంద్ర విద్యాశాఖ సూచించింది. కౌన్సెలింగ్ అవసరం : ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుదీ (నిట్ డైరెక్టర్, వరంగల్) విద్యార్థుల ఆత్మహత్యలను సీరియస్‌గా తీసుకోవాలి. మనోనిబ్బరం కోల్పోయిన వారికి ఒకసారి సాదాసీదా కౌన్సెలింగ్ ఇస్తే సరిపోదు. దశలవారీగా కౌన్సెలింగ్ ఇవ్వాలి. అతనిలో వచ్చే మార్పులను గమనించాలి. అవసరమైతే తల్లిదండ్రులనూ పిలిచి వారితో ధైర్యం చెప్పించాలి. ప్రతీ ఎన్‌ఐటీలోనూ కౌన్సెలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలన్న ఆలోచన మంచిదే. ఒత్తిడికి లోనవుతున్నారు: డాక్టర్ ఎన్వీ రమణారావు (నిట్ డైరెక్టర్, రాయ్‌పూర్) జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీటు వచ్చే వరకూ చదవడం వేరు. వచ్చిన తర్వాత చేయాల్సిన కృషి వేరు. ఈ తేడాను గుర్తించలేక విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. ఇలాంటి వారిని గమనించేందుకు ప్రతీ పది మంది విద్యార్థులకు ఒక మెంటార్‌ను నియమించాం. -
హైదరాబాద్ లో కలకలం రేపుతున్న ఆత్మహత్యలు
-
ఎన్నెన్నో కష్టాలు.. డ్యూటీ ఎలా చేసేది
ఆగ్రా: దేశంలో మహిళా పోలీసుల బలవన్మరణాల సంఖ్య పెరుగుతోంది. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో ఇద్దరు మహిళా పోలీసులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో పోలీసు శాఖలో మహిళా ఉద్యోగుల స్థితిగతులపై చర్చ మొదలయ్యింది. ఇందులో భాగంగానే మహిళా పోలీసు అధికారులపై ఇండియాటుడే.కామ్ ఓ అధ్యయనం నిర్వహించింది. మహిళా పోలీసులు తమని తాము రక్షించుకునేందుకు పురుషాధిపత్యంతో ఉన్న మగ పోలీసుల నుంచి ఎన్నెన్నో కష్టాలను ఎదుర్కొంటున్నట్టు తేటతెల్లమయ్యింది. పోలీసు దుస్తుల్లో ఉన్నా, స్త్రీలమని గుర్తుచేస్తారు ఆగ్రాలోని స్థానిక పోలీస్ స్టేషన్లో పనిచేసే ఓ మహిళా కానిస్టేబుల్ ఇండియాటుడేతో మాట్లాడుతూ ‘‘తాను పోలీసు యూనిఫాం ధరించి ఉండవచ్చు, అయినప్పటికీ అడుగడుగునా తాను మహిళననే విషయం గుర్తుచేస్తూనే ఉంటారు’’ అని వ్యాఖ్యానించారు. సాధారణ మహిళలకూ తమకీ ఎటువంటి తేడా ఉండదని, సాధారణ మహిళలు ఎదుర్కొంటున్నట్టే విధినిర్వహణ విషయంలో తాము కూడా అనేక ఇబ్బందులను పంటి బిగువున అదిమిపట్టాల్సి వస్తుందన్నారు. సాధారణ మహిళ లు అడుగు బయటపెట్టినప్పుడు ఎలాంటి వివక్షనీ, ఇబ్బందులనూ ఎదుర్కొంటారో అవన్నీ తమకు కూడా సహజమేనని ఆమె వ్యాఖ్యానించారు. మహిళా పోలీసులకే అసౌకర్యం ఉన్నచోట ఇతర మహిళలకు దిక్కేదీ? పోలీస్ స్టేషన్లలో మహిళా పోలీసులకు ఉద్యోగాల్లో ఉంచడం వల్ల, మహిళలంతా పోలీస్ స్టేషన్లలో ఇబ్బందిపడకుండా ఉండగలుగుతారని భావిస్తారని, అయితే ‘‘మహిళా పోలీసులే పోలీస్ స్టేషన్లలో అసౌకర్యంగా , ఇబ్బందికరంగా ఫీల్ అవుతుంటే, మిగిలిన మహిళలను వాళ్ళెలా సౌకర్యవంతంగా ఉంచగలుగుతారు’’అని ఆమె ప్రశ్నించారు. పని విషయంలో సమానత్వమే సమాన గౌరవం దక్కదు పురుష ఉద్యోగులతో సమానంగా మహిళా పోలీసులు పనిచేయాలని అధికారులు కోరుకుంటారు. అలాగూ పురుష పోలీసులతో సమానంగా పనిచేయించుకుంటారు. కానీ పురుష పోలీసులతో సమానంగా మాత్రం చూడరని, వివక్ష తమని వెన్నాడుతూనే ఉంటుందని మరో పోలీస్ కానిస్టేబుల్ వ్యాఖ్యానించారు. వెకిలి జోకులు.. తప్పుడు కామెంట్లు పోలీసు అధికారులు, కానిస్టేబుళ్ళు అన్న తేడా లేకుండా, మహిళా పోలీసుపై వెకిలి జోకులూ, తప్పుడు కామెంట్లతో వేధిస్తుంటారు. ఆ మాటలు వినలేక అక్కడి నుంచి వెళ్ళిపోవడం తప్ప చేసేదేం ఉండదు. అంటారు మరో మహిళ పోలీసు. కొత్తగా రిక్రూట్ అయిన మహిళా పోలీసులు, అధికారుల చేతిలో మరింతగా ఇలాంటి వివక్షకూ, ఇబ్బందులకూ గురవుతారని మహిళా కానిస్టేబుల్ చెప్పారు. ఇన్‌చార్జ్‌ల వేధింపులు రాకబ్ గంజ్ వుమెన్ పోలీస్ స్టేషన్ కి రావడానికి ముందు మరో పోలీస్ స్టేషన్ పనిచేశానని, అక్కడి ఇన్‌చార్జ్‌తో వేధింపులు తాళలేకపోయానని అంటారు మరో మహిళా పోలీసుల. స్నేహంగా ఉందామని చెప్పి నా బతుకు నరకంగా మార్చేశాడంటారు ఆమె. తాను రాజీనామా చేసి వెళ్ళిపోవాలనుకున్నానని, ప్రభుత్వ ఉద్యోగం దొరకడం ఎంత కష్టమో తెలుసు కనుక తన కుటుంబ సభ్యులు వారించారనీ అంటారామె. పోలీసు ఉద్యోగంలో చేరి తప్పు చేశాను తాను పోలీసు ఉద్యోగంలో చేరినప్పుడు తన మిత్రులు కొంత మంది తాను, ఈ ఉద్యోగంలో కన్నా టీచర్ ఉద్యోగంలో చేరి వుంటే బాగుండేదని కామెంట్ చేశారు. అయినా బలవంతంగా ఇందులో చేరాను. అప్పుడు వారికేం సమాధానం చెప్పలేకపోయినా, యిప్పుడు మాత్రం తాను పోలీసు ఉద్యోగంలో చేరాలన్న నిర్ణయం అంత మంచి విషయమేం కాదని భావిస్తున్నట్టు మరో మహిళా హెడ్ కానిస్టేబుల్ వ్యాఖ్యానించారు. పోలీసు సిబ్బందిలో మహిళలకు సరైన వాతావరణం లేదు పోలీసు సిబ్బందిలో మహిళా పోలీసులు పనిచేసేందుకు సరైన వాతావరణం లేదని మహిళా సబ్ ఇన్స్పెక్టర్ అన్నారు. కొత్తగా రిక్రూట అయినవారికి మరిని మరింత ఇబ్బంది పెడతారు. పురుష పోలీసులు వారికి పదే పదే ఫోన్లు చేయడం, ఫోన్లలో అశ్లీల ఫొటోలు పంపుతూ వేధింపులకు గురిచేస్తారని ఆమె చెప్పారు. ఆగ్రా ఎస్ఎస్పి బబ్లు కుమార్ పురుష పోలీసులపై చేసిన ఆరోపణలన్నింటినీ కొట్టిపారేశారు. పోలీసు డిపార్టుమెంట్ మహిళలకు సురక్షితమైన పరిస్థితులను కల్పిస్తున్నారని, ఎవరికైనా ఇబ్బందులు వస్తే, తనని నేరుగా కలవొచ్చునని వ్యాఖ్యినంచారు. -
తొందరగా వెళ్లిపోయావ్ మిత్రమా!
న్యూఢిల్లీ: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బాలీవుడ్ నటుడే కానీ క్రికెట్ చూసే ప్రతీ ఒక్కరికీ అతనో ‘బాలీవుడ్ ఎంఎస్ ధోని’. భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని జీవిత కథ ఆధారంగా నిర్మించిన ‘ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ’ సినిమాలో మహి పాత్రలో పరకాయ ప్రవేశం చేసి అతను క్రికెట్ వర్గాలకు సుపరిచితుడయ్యాడు. డిప్రెషన్ కారణంగా 34 ఏళ్ల సుశాంత్ ముంబైలోని తన ఇంట్లో ఆదివారం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడటంతో క్రికెట్ వర్గాలు విస్తుపోయాయి. పలువురు క్రికెటర్లు సుశాంత్ విషాదాంతంపై విస్మయానికి లోనయ్యారు. చిన్న వయసులోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయావు మిత్రమా అంటూనే... ఈ వార్త అబద్ధమైతే బావుండంటూ సామాజిక మాధ్యమాల ద్వారా తమ ఆవేదన వ్యక్తం చేశారు. సుశాంత్ మరణం కలిచి వేస్తోంది. అతనో ప్రతిభావంతుడైన యువ నటుడు. వారి కుటుంబానికి, స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతి. నీ ఆత్మకు శాంతి చేకూరాలి. –సచిన్ టెండూల్కర్ ఈ వార్త విని షాకయ్యా. ఇది జీర్ణించుకోవడం కష్టం. దేవుడు వారి కుటుంబానికి ధైర్యాన్నివ్వాలి. – కోహ్లి దీన్ని నమ్మాలనిపించట్లేదు. చాలా బాధగా ఉంది. నీ ఆత్మకు శాంతి కలగాలి బ్రదర్. –రోహిత్ శర్మ షాకింగ్, నమ్మడానికి చాలా కష్టంగా ఉంది. సుశాంత్ కుటుంబం కోసం ప్రార్థిస్తా. –శిఖర్ ధావన్ జీవితం సున్నితమైనది. ఎవరి జీవితంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. అందరితో దయతో మెలగండి. ఓం శాంతి. –వీరేంద్ర సెహ్వాగ్ నిజంగా దీన్ని నమ్మలేను. ఓ ప్రతిభావంతుడైన యువకుడి జీవితం ఇలా ముగుస్తుందనుకోలేదు. లోపలి సంఘర్షణను ఎవరూ తెలుసుకోలేరు. –యువరాజ్ సింగ్ మానసిక ఆరోగ్యంపై దృష్టి సారించాల్సిన సందర్భమిది. సుశాంత్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. –వీవీఎస్ లక్ష్మణ్ నీకు ఇంకా చాలా అందమైన జీవితం ఉంది. చాలా తొందరగా వెళ్లిపోయావు సుశాంత్. –షోయబ్ మలిక్ (పాక్ క్రికెటర్) షాకింగ్. చాలా తొందరగా వెళ్లిపోయావు. ఆన్‌స్క్రీన్ ధోనిని కోల్పోయాం. –సైనా నెహ్వాల్ (స్టార్ షట్లర్) సుశాంత్ మనం ఇద్దరం కలిసి టెన్నిస్ ఆడదామని చెప్పావ్. నువ్వున్న చోటల్లా సంతోషం, నవ్వులు పంచావ్. చివరకు ఇంత బాధపెడతావ్ అనుకోలేదు. హృదయం బద్ధలవుతోంది. –సానియా మీర్జా (టెన్నిస్ స్టార్) ఆ అందమైన నవ్వు వెనక ఎంత సంఘర్షణ దాగుందో తెలుసుకోలేకపోయాం. చాలా పెద్ద నిర్ణయం తీసుకున్నావు. మేం నిన్ను కోల్పోయాం. –మిథాలీ రాజ్ ఎవరైనా ఇది అబద్ధమని చెప్పండి. సుశాంత్ లేడనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. –హర్భజన్ ఈ విషాదాంతం షాకింగ్‌గా ఉంది. కుటుంబానికి, అభిమానులకు నా సంతాపం. –రవిశాస్త్రి మనం ఒక అందమైన పిల్లాడిని, విద్యావంతుణ్ని, కష్టపడి విజయాన్ని సాధించిన వ్యక్తిని కోల్పోయాం. ధోని సినిమా కోసం 9 నెలలు ప్రొఫెషనల్ క్రికెటర్లా ప్రాక్టీస్ చేశాడు. హెలికాప్టర్ షాట్లో పరిపూర్ణత సాధించాడు. ఎన్ని గాయాలు తగిలినా వికెట్‌కీపింగ్ కోసం సిద్ధంగా ఉండేవాడు. అద్భుతమైన తన ప్రయాణాన్ని అర్ధాంతరంగా ముగించాడు. నమ్మలేకపోతున్నా. –కిరణ్ మోరే (ధోని బయోపిక్ కోసం భారత మాజీ వికెట్ కీపర్ మోరే వద్ద సుశాంత్ శిక్షణ తీసుకున్నాడు) -
స్వేదం చిందిస్తే..కన్నీరే మిగిలే !
సాక్షి, మచిలీపట్నం : ‘నింగి వెన్నపూస వాడు.. నేల వెన్నుపూస నువ్వు’ అంటూ సినీకవి సుద్దాల అభిమానంగా రాసుకున్నా, ‘వాడు చెమటోడ్చి ప్రపంచమునకు భోజనము పెట్టు / కానీ వానికి భుక్తి లేదు’ అంటూ జాషువా పాలకుల నిర్లక్ష్యాన్ని గుర్తు చేసినా, ‘పొలాలనన్నీ / హలాల దున్నీ / ఇలాతలంలో/ హేమంపిండే’ అంటూ శ్రీశ్రీ మొత్తుకున్నా అదంతా నాగలి పట్టి భూమాతను నమ్ముకున్న కర్షకుల స్వేదయాగం గురించే. నారు వేసిన నాటి నుంచి ధాన్యం ఇంటికి చేరే వరకు రైతన్న జీవితమంతా నమ్మకం మీదనే సాగుతుంది. అసలు భూమికి–రైతుకి ఓ విడదీయలేని బంధమే ఉంటుంది. అయితే ప్రకృతి చేసే ప్రకోపానికి, పాలకులు చేసే అకృత్యాలకు చేష్టలుడిగిపోవడం మినహా వీరికి మరో గత్యంతరం కనపడటం లేదు. అరచేతిలో గీతలు అరిగిపోయేదాకా అరకతిప్పినా గుప్పెడు గింజలు ఇంటికి రాలేని పరిస్థితి నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతన్నది. ఇక పాలుతాగుతున్న పొత్తిళ్ల బిడ్డ నీట మునిగితే మాతృమూర్తి ఎలా తల్లడిల్లుతుందో తుపానులు అదే తరహాలో రైతన్న గుండెను పిండేశాయి. పొలం నుంచి పళ్లెంలోకి.. అక్కడి నుంచి నోటి వరకు చేర్చడంలో రైతన్న పడే ప్రయాస పచ్చపాలకుల కళ్లకు కానరాలేదు ఈ ఐదేళ్లలో. ఆపత్కాలంలో ఆదుకోవాల్సిన ఏలికలు పత్తా లేకపోతే కనిపించిన చోటల్లా చేసింది అప్పులే. రుణమాఫీ, పంటల బీమా అంటూ ఏవోవో పేర్లు పెట్టేసి ఆపద కాలంలో నాలుగు చల్లటి మాటలు చెప్పి ఊరడించిన పాలకులు ఆ తరువాత తమ ముఖం చూడకపోతే రైతు బిక్కం ముఖం వేయక ఇంకేం చేస్తాడు. ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వం వ్యవసాయ రంగంపై చూపిన నిర్లక్ష్యాన్ని ఓ మారు రైతుకు గుర్తు చేస్తే కస్సుమంటున్నాడు.తమకేం చేశారో చెప్పాలంటూ నిగ్గదీస్తున్నాడు. పంట సాగుకు అనువైన సమయంలో ప్రభుత్వం సాగునీటిని విడుదల జాప్యం చేయడం.. ధాన్యానికి మద్దతు ధర లేకపోవడం.. పంట చేతికొచ్చే సమయంలో పెథాయ్ తుపాను దెబ్బతీయడం.. పూర్తిస్థాయిలో పంట నష్ట పరిహారం అందక, రుణమాఫీకి నోచుకోక రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ నష్టాన్ని రబీలోనైనా పూడ్చుకుందామనుకుంటే దాళ్వా సాగుకు ప్రభుత్వం నీటిని విడుదల చేయకపోవడంతో ఐదేళ్ల పాటు కర్షకులకు కన్నీళ్లు తప్పలేదు. జిల్లాలో ఇదీ దుస్థితి జిల్లాలో ప్రతి ఏటా ఖరీఫ్‌లో వరి, జొన్న, మొక్కజొన్న, పెసర, కంది, మినుము, వేరుశనగ, నువ్వులు, పత్తి, మిరప, చెరకు, పసుపు తదితర పంటలు సాగవుతాయి. ఖరీఫ్ సాగు సాధారణ సాగు విస్తీర్ణం 3.23 లక్షల హెక్టార్లు కాగా.. ఏటా 3.28 నుంచి 3.48 లక్షల హెక్టార్ల వరకు సాగవుతోంది. రబీలో సైతం లక్ష హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగవుతాయి. కలగానే నీటి విడుదల జిల్లా వ్యాప్తంగా సాగునీరందించేందుకు ప్రధానంగా మూడు కాలువలున్నాయి. కేఈబీ, బందరు కాలువ, ఏలూరు, రైవస్ కాలువలకు కలిపి రోజుకు 10,000 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాల్సి ఉండగా.. కేవలం 5,300 క్యూసెక్కుల మాత్రమే విడుదల చేశారు. ఈ పరిణామం పంటలపై పడింది. నీరందక ఎండుముఖం పట్టిన సందర్భాలు సైతం ఉన్నాయి. నత్తనడకన ధాన్యం సేకరణ 2.47 లక్షల హెక్టార్లకు 13.40 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అందుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. 323 కొనుగోలు కేంద్రాల ద్వారా 9.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటి వరకు 7.40 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సేకరించారు. దీంతో చేసేది లేక రైతులు ధన్యాన్ని తక్కువ ధరకు బహిరంగ విపణిలో దళారులకు విక్రయించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. పెరిగిన పెట్టుబడి వ్యయం వరిసాగుకు రైతులకు ఖర్చులు తడిసిమోపెడయ్యాయి. కోత దశకు వచ్చే సమయానికి ఎకరానికి రూ.35,000 వరకు పెట్టుబడి పెట్టారు. దీనికి తోడు కోత కూలీ, కుప్పలు వేసేందుకు కూలీ, పురుగు మందుల ధరలు ఇలా మరో రూ.5 వేలు వెచ్చించాల్సి ఉంది. ఎకరానికి సగటున రూ.40 వేలు పెట్టుబడి పెట్టారు. తుపాను కల్లోలం వరి కోత సమయంలో రైతులను పెథాయ్ తుపాను కల్లోలం సృష్టించింది. మూడు రోజుల పాటు కురిసిన ఎడతెరిపి లేని వర్షాలకు జిల్లా వ్యాప్తంగా 47,000 హెక్టార్లలో పంట నీట మునిగింది. తుపాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా రూ.27 కోట్లు నష్టం వాటిల్లిందని తొలుత అధికారులు అంచనాలు రూపొందించారు. అనంతరం జిల్లా పర్యటనకు వచ్చిన కేంద్ర బృందానికి రూ.525 కోట్లు పంట, గొర్రెలు, రహదారులు నష్టం వాటిల్లినట్లు జిల్లా అధికారులు కేంద్రానికి నివేదించారు. అయితే ఇప్పటి వరకు కేవలం రూ.14 కోట్ల మేర బీమా మంజూరు చేశారు. నష్టపరిహా రంలో మాత్రం నయాపైసా విడుదల చేయలేదు. రుణమాఫీ ఊసేదీ? జిల్లాలో రుణమాఫీ పరిస్థితి దారుణంగా తయారైంది. రుణమాఫీకి 4,44,972 మంది రైతులు అర్హత సాధించారు. మొత్తం రూ.1507 కోట్లు మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి విడతగా రూ.577 కోట్లు, రెండో విడతగా రూ.232, మూడో విడతగా రూ.232 కోట్లు విడుదల చేసింది. ఇంత వరకు బాగానే ఉన్నా మూడో విడత రుణామాఫీనే ఇప్పటికీ 30 శాతం మంది రైతులకు అందలేదు. ఇక నాలుగో విడత, ఐదో విడత అందడమన్నది పెరుమాళ్లకెరుక. ఐదేళ్లలో 48 మంది మృతి! టీడీపీ అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో జిల్లా వ్యాప్తంగా 48 మంది రైతులు వ్యవసాయంలో నష్టాలు రావటంతో పంటసాగు చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నారు. జీఓ నెంబర్ 421 ప్రకారం అప్పులబాధ తాళలేక చేసుకున్న ఎలాంటి ఆత్మహత్యనైనా రైతు ఆత్మహత్యగా గుర్తించాలి. కానీ ప్రభుత్వం సవాలక్ష నిబంధనలు పెట్టి మరికొంత మందిని ఈ జాబితాలోకి చేర్చకపోవడంతో రైతు కుటుంబాలకు అన్యాయం జరిగింది. ఆత్మహత్య చేసుకున్న రైతులకు పరిహారం ఇవ్వాలని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అసెంబ్లీలో డిమాండ్ చేస్తే.. రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. కానీ ఇందులో సింహభాగం కుటుంబాలకు ఇప్పటికే అందలేదన్న ఆరోపణలు ఉన్నాయి. కనీస మద్దతు ధర లేదు ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు కనీస మద్దత ధర లభించడం లేదు. ధాన్యం అమ్మిన సొమ్ము కోసం అధికా రులు చుట్టూ తిరగడమే సరిపోయింది. నాకు ఉన్న నాలుగు ఎకరాల్లో పండిన ధాన్యాన్ని అమ్ముకున్నా. ధాన్యం ఒకరు తీసుకున్నారు. సొమ్ములకు మరొకరిని కలవమంటున్నారు. రోజూ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా. కాళ్లు అరుగు తున్నాయి తప్ప కనికరించే వారు కరువయ్యారు. వెళ్లిన ప్రతిసారి అధికారులకు విన్నవించినా పట్టించుకోని పరిస్థితి ఉంది. వ్యవసాయానికి చేసిన అప్పులుకు వడ్డీలు పెరిగి ఇబ్బందులు పడ్డాం. అప్పులు ఎలా తీర్చాలి, ఇంట్లో ఎలా తినాలి. – సగ్గుర్తి నాగభూషణం, పుల్లూరు, మైలవరం -
సేద్యం..బతుకు దైన్యం
సాక్షి, అమరావతి : అన్నం పెట్టే అన్నదాతకు ఆకలి పేగులు మిగిలాయి..పచ్చని సిరులు కురిపించే పంట పొలాలు.. ఎండిన మోడులయ్యాయి..పల్లె గూటిలో కమ్మిన కరువు మేఘాలు.. కన్నీటి ధారలై కురిశాయి.పంట దిగుబడులకు పడిన ధరల కళ్లేలు.. కర్షకుడ్ని కష్టాల ఊబిలోకి నెట్టేశాయి..మేతలేని పశువులు.. కబేళా కత్తికి ముక్కలు ముక్కలయ్యాయి..గుక్కెడు నీళ్లు దొరకని పల్లె గొంతులకు వెక్కిళ్లే దిక్కయ్యాయి..అడుగంటి భూగర్భ జలాలు.. కొండ రాళ్ల కింద ఇంకిపోయాయి.. బోరుమంటున్న జీవితాలకు .. కన్నీటి ఏరులే మిగిలాయి..కళతప్పిన పల్లెలను విడిచిన బతుకులు.. మెతుకుల వేటకై వలసబాట పట్టాయి..ఐదేళ్ల కాలంలో ప్రభుత్వ సాయమెరుగక జిల్లాలో అనేక మంది రైతన్నల ప్రాణాలు అప్పుల ఉరికొయ్యకు వేలాడాయి. అన్నదాత వ్యవసాయ జూదంలో ప్రతి ఏటా ఓడిపోతూనే ఉన్నారు. ప్రకృతి వైపరీత్యాలకు తోడు, తెగుళ్లు, చీడపీడలు, గిట్టుబాటు ధరలేక రైతులు కుదేలయ్యారు. ఐదేళ్లలో పత్తి, మిర్చి ధరలు పతనమయ్యాయి. పత్తి పంటకు గులాబి పురుగు సోకడంతో ఎకరాకు నాలుగైదు క్వింటాళ్ల దిగుబడి కూడా రాలేదు. మిరపకు జెమిని వైరస్ సోకి ఎకరాకు 5–7 క్వింటాళ్లకే పరిమితమైంది. జెమిని వైరస్ పూత, పిందె దశలో రావడంతో పంటను పీకేయాల్సిన దుస్థితి నెలకొంది. రైతుల పెట్టుబడులు మట్టి పాలయ్యారు. మినుము పంట ఆకుముడత తెగులుతో పూర్తిగా దెబ్బతింది. ప్రభుత్వం 4,5 విడత రుణమాఫీ ఇంకా అందించలేదు. కౌలు రైతులను పట్టించుకోలేదు. ఐదేళ్లలో జిల్లాలో రైతులు 10 వేల కోట్ల రూపాయలు నష్టపోయారు. రుణమాఫీ మాయ... ప్రభుత్వం ఐదు విడతల్లో రుణమాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. నాలుగు, ఐదు విడతల సొమ్ము ఇంకా అందలేదు. జిల్లాలో రూ.900 కోట్ల రైతుల ఖాతాలకు జమ కావాల్సి ఉంది. నాలుగో విడత రుణమాఫీకి సొమ్ము గత ఏడాది సెస్టెంబరు, అక్టోబరులోపు ఇవ్వాల్సి ఉన్నా ప్రభుత్వం ఇంత వరకు జమ చేయలేదు. జిల్లాలో అనధికారిక లెక్కల ప్రకారం 3.5 లక్షల మందికిపైగా కౌలు రైతులు ఉన్నారు. కేవలం 98 వేల మందికి మాత్రమే కౌలు రైతు అర్హత పత్రాలు ఇచ్చారు. కోలుకోలేని దెబ్బ జిల్లాలో ప్రత్తి మొదలు, మిరప, మినుము, జొన్న,మొక్కజొన్న, కంది..ఇలా జిల్లాలో పంటలు సాగు చేసిన లక్షల మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. గత ఏడాది జొన్న, మొక్క జొన్నలు క్వింటాళ్లకు రూ.1000లోపే ఉంది. మినుము రూ.3500కు పడిపోయింది. శనగ క్వింటాళ్లు రూ.3600కే పరిమితమైంది. పెథాయ్ తుఫాన్ వరి రైతు వెన్ను విరిచింది. పంట నీట మునగటంతోపాటు కళ్లాల్లో ధాన్యం తడిచి మొలకెత్తడంతోపాటు రంగు మారింది. దీంతో రైతులు భారీగా నష్టపోయారు. దీనికి సంబంధించి రూ.67 కోట్లు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇది రైతులకు మాత్రం చేరలేదు. జిల్లాలో 9 కరువు మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. సర్వే చేసిన వ్యవసాయాధికారులు రూ.43 కోట్లు పంట నష్టపోయినట్లు గుర్తించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఇంత వరకు ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. తాగునీటి ఎద్దడి జిల్లాలోని పల్నాడుతోపాటు అనేక గ్రామాలు తాగునీరు లేక గొంతెండుతున్నాయి. వందల అడుగుల లోతులో తవ్వినా జలధార లేక విలవిలలాడుతున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా చెరువులు ఎండిపోయాయి. జీవనది వంటి నాగులేరు సైతం నీళ్లు లేక రాళ్లు తేలి నిర్జీవంగా దర్శనమిస్తోంది. ఐదేళ్లలో రైతుల ఆత్మహత్యలు ప్రభుత్వం అధికారికంగా గుర్తించిన ఆత్మహత్యల సంఖ్య : 113 అనధికారికంగా ఆత్మహత్య చేసుకున్న రైతుల సంఖ్య : 250మందికి పైనే పరిహారం అందింది : 64 మందికి రైతుల పరిస్థితి దయనీయం తంగెడ మేజర్ కాలువను అనుకుని పెదగార్లపాడు ఉంది. పత్తి, మిరప సాగు చేశాం. పంటకు గిట్టుబాటు ధరలేదు. ప్రభుత్వం సకాలంలో సాగునీరు విడుదల చేయలేదు. గిట్టుబాటు ధర లేకపోవటం వలన గ్రామాల్లో కరువు వచ్చింది. ఆపదలో సైతం డబ్బుల కోసం ఇబ్బందులు పడుతున్నాం. పరిస్థితి ఇలాగే కొనసాగితే బతకటం చాలా కష్టంగా ఉంటుంది. – కర్పూరపు వెంకటకోటయ్య,పెదగార్లపాడు వ్యవసాయం సంక్షోభంలో ఉంది ఐదేళ్లుగా పంటలు పండటం లేదు. రామాపురం మేజర్ కాలువ, దండివాగు ఎత్తిపోతల పథకం ద్వారా సాగు నీరు అందని పరిస్థితి. వ్యవసాయం అంటే సంతోషంగా ఉండే మేము సంక్షోభంలో పడ్డాం. వ్యవసాయాన్ని ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. రైతులంటే చంద్రబాబుకు గిట్టదు కాబట్టే పట్టించుకోవటం లేదు. – ఆకూరి వీరారెడ్డి, రామాపురం -
ఆలికి పరీక్ష .. ఆపై హతం
వారిద్దరూ ఒకేచోట కలిసి పెరిగారు.. ఆడిపాడుతున్న క్రమంలోనే ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకున్నాక ఇద్దరు సంతానం కూడా పుట్టారు. ఈ నేపథ్యంలో భర్త అసలు రంగు బయటపడింది. ప్రేమ బాసలు.. పెళ్లి ప్రమాణాలు మరిచాడు. అదనపు కట్నం వేధింపులతోపాటు వదిలించుకునేందుకు పన్నాగం పన్నాడు. ఈ కుట్ర తెలియని అమాయక ఇల్లాలకు కాపురం పరీక్ష పెట్టాడు. నేను నీతో మాట్లాడుతున్నట్లు ఊరిలో ఎవరికీ తెలియకూడదని షరతు విధించాడు. ఇందులో నువ్వు నెగ్గితేనే జీవితమని, లేకుంటే తీసుకెళ్లనని తేల్చిచెప్పాడు. ఈ చివరి పరీక్షలోనే గొంతు నులిమి, తలను నేలకి బాది మరీ దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన మండలంలోని పల్లివూరు పంచాయతీ హకుంపేటలో మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. సాక్షి, వజ్రపుకొత్తూరు: గ్రామానికి చెందిన మైలపల్లి పుష్పలత(24) భర్త శంకర్ చేతిలో హత్యకు గురైంది. ఈ విషయం తెలుసుకున్న మృతురాలి తల్లిదండ్రులు కన్నీరుమన్నీరయ్యారు. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని హుకుంపేటకు చెందిన గుంటు ఎర్రన్న రాజులమ్మ పెద్ద కుమార్తె పుష్పలత, అదే గ్రామానికి చెందిన మైలపల్లి దానేస్, గన్నెమ్మల కుమారుడు శంకర్ ప్రేమించకున్నారు. వరుసకు మేనత్త కుమారుడు కావడంతో అమ్మాయి తల్లిదండ్రులు కాదనలేక 2014 మార్చిలో వీరిద్దరికీ వివాహం చేశారు. ఈ క్రమంలో దుబాయ్‌లో శంకర్ వలస కూలీగా పని చేసేవాడు. నాలుగేళ్లపాటు అన్యోన్యంగా సాగిన వీరి దాంపత్య జీవితానికి గుర్తుగా కుమారుడు ప్రణయ్(3), కుమార్తె వర్షిణి(2) పుట్టారు. ఈ నేపథ్యంలో పుష్పలత రెండోసారి గర్భం దాల్చగానే రెండేళ్ల కిందట భర్త వదిలేశాడు. కన్నవారి ఇంటికి చేరుకున్న ఈమెకు కుమార్తె వర్షిణి పుట్టాక తనను తీసుకెళ్లాలంటూ నిత్యం కోరేది. అయితే తనంటే ఇష్టం లేదని, వదిలేస్తానని నిత్యం వేధిస్తూ.. మరో అమ్మాయి ఫొటోనే భార్యకు వాట్సాప్‌లో పంపేవాడు. మనో వేదనకు గురైన పుష్పలత బావా తనకు అన్యాయం చేయొద్దని వేడుకునేది. పరీక్ష పాసైతే నీతోనే.. అదనపు కట్నం తీసుకురావాలని భర్త వేధించడంతోపాటు తన కుమార్తె కాపురాన్ని చక్కదిద్దాలని రెండు నెలలు కిందట తల్లి రాజులమ్మ గ్రామ పెద్దలను కోరింది. అయితే బావ మారాడని కుమార్తె చెప్పడంతో తల్లి మెత్తబడింది. నెల రోజుల కిందట అల్లుడి ఇంటికి పుష్పలతను తీసుకెళ్లగా గమనించిన అతడు ఇంటి నుంచి పారిపోయాడు. అప్పట్నుంచీ భార్యను ఇంటి నుంచి పంపితేనే వస్తానని, లేకుంటే చనిపోతాని బెదిరించడంతో ఈమె ఇటీవల కన్నవారి ఇంటికి చేరుకుంది. ఈలోగా భార్య అడ్డు తొలగించుకునేందుకు పన్నాగం పన్నాడు తన చిన్నాన్న కుమారుడైన వెంకటరమణతో భార్యకు నిత్యం సమాచారం పంపేవాడు. తాను పెట్టిన పరీక్షలో నెగ్గితేనే తీసుకెళ్తానని నమ్మించాడు. ‘నీతో మాట్లాడుతున్నట్లు గ్రామంలోను, మీ ఇంటిలో మీ అమ్మనాన్నలకు, పెద్దలకు తెలియకూడదు. ఇదీ నీకు చివరి పరీక్ష ఇందులో నీవు పాస్ అవ్వాలి’ అన్నాడు. ఈలోగా భర్త మంగళవారం ఫోన్ చేసి మాట్లాడటంతో భార్య మనసు కరిగిపోయింది. ‘రాత్రికి మీ ఇంటికి వస్తాను.. మీ ఇంటిలో మీ అమ్మను మీ తాతా వాళ్ల ఇంటికి పంపించు’ అని చెప్పడంతో భర్త మాయమాటలు నమ్మి ఆ విధంగా చేసింది. అదే రోజు అర్ధరాత్రి అక్కడకు వెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టాడు. సూసైడ్‌గా మార్చే ప్రయత్నం భర్త భార్యను హతమార్చి మృతదేహాన్ని తాడుకు కట్టి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని చిత్రీకరించబోయాడు. ఈ విషయం తెలుసుకున్న మృతురాలి కుటుంబ సభ్యులు హతాశులయ్యా రు. బోరున విలపిస్తూ మృతదేహాన్ని కిందకు దించారు. అయితే మెడపైన గోళ్లతో రక్కిన ఆనవాళ్లు, తల వెనుక భాగంలో బలమైన గాయాలు ఉండటంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై నరసింహమూర్తి నిందితుడు శంకర్‌ను తమదైన శైలిలో విచారించడంతో తానే చంపినట్లు అంగీకరించాడు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు వజ్రపుకొత్తూరు తహసీల్దారు జీ కల్పవల్లి ఆధ్వర్యంలో శవపంచనామా చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని కాశీబుగ్గ డీఎస్పీ బర్ల ప్రసాదరావు పరిశీలించారు. కేసు దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు. -
ఇది ఆత్మహత్య కాదు.. ప్రభుత్వ హత్య
-
వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు ఆత్మహత్య
మొయినాబాద్(చేవెళ్ల) : పదకొండేళ్లు భర్త వేధింపులను భరించింది. అయినా భర్తలో మార్పు రాకపోగా వేధింపులు మరింత ఎక్కువ కావడంతో ఓ వివాహిత భరించలేక తనువు చాలించింది. ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మొయినాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని కనకమామిడి గ్రామానికి చెందిన చనుగొముల శ్రీనివాస్‌కు సరూర్‌నగర్ మండలం నాదర్గుల్కు చెందిన అరుణ(30)ను ఇచ్చి 11 సంవత్సరాల క్రితం వివాహం జరిపించారు. వీరికి కూతురు తేజ(8), కొడుకు సోను(6) ఉన్నారు. కొంతకాలం పాటు వారి కాపురం సాఫీగానే సాగింది. ఆ తరువాత భర్త శ్రీనివాస్ భార్యను వేధించడం మొదలు పెట్టాడు. ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరగడంతో పలుమార్లు గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టి సర్ది చెప్పారు. అయినా వారి తీరులో మార్పు రాలేదు. దీంతో రెండేళ్ల క్రితం అరుణ.. భర్త, పిల్లలను వదిలి తల్లిగారింటికి వెళ్లింది. అప్పటి నుంచి శ్రీనివాస్ మొయినాబాద్ మండల కేంద్రంలోని విజయనగర్ కాలనీలో ఇస్త్రీ డబ్బా పెట్టుకుని జీవిస్తున్నాడు. కాగా గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు సర్ది చెప్పడంతో రెండు నెలల క్రితం అరుణ మళ్లీ భర్త వద్దకు చేరుకుంది. విజయనగర్కాలనీలోనే ఇళ్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. కాగా శుక్రవారం భార్యాభర్తల మధ్య మళ్లీ గొడవ జరిగింది. శుక్రవారం రాత్రి పిల్లలతో కలిసి ఇద్దరూ ఇంట్లోనే ఉన్నారు. శనివారం ఉదయం శ్రీనివాస్ పాల ప్యాకెట్ తేవడానికి ఇంట్లో నుంచి బయటకు వెళ్లి అరగంట తరువాత తిరిగి వచ్చాడు. అప్పటికే అరుణ చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అప్పటికీ పిల్లలు నిద్ర లేవలేదు. గమనించిన చుట్టుపక్కలవారు పోలీసులకు సమాచారం అందించడంతో సీఐ వెంకటేశ్వర్లు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతురాలి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. కడుపునొప్పితో నవ వధువు.. తాండూరు రూరల్: కడుపునొప్పి భరించలేక ఓ నవ వధువు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మండలంలోని నారాయణపూర్‌లో గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. కరన్‌కోట్ ఎస్సై రేణుకారెడ్డి కథనం ప్రకారం... నారాయణపూర్ గ్రామానికి చెందిన కుర్వ జ్యోతి(24)ని తాండూరు మండలం చంద్రవంచ గ్రామానికి చెందిన శ్రీనివాస్‌కు ఇచ్చి మూడు నెలల క్రితం వివాహం చేశారు. కొన్ని రోజులుగా జ్యోతి కడుపునొప్పితో బాధపడుతోంది. ఏరువాక పండుగ సందర్భంగా జ్యోతి తన భర్త శ్రీనివాస్‌తో కలిసి పుట్టిళ్లు అయిన నారాయణపూర్‌కు వచ్చింది. కడుపునొప్పి భరించలేక జ్యోతి శుక్రవారం రాత్రి పురుగుల మందు తాగింది. వెంటనే ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ జ్యోతి శనివారం ఉదయం మృతి చెందింది. జ్యోతి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కడుపునొప్పికి తాళలేక యువకుడు.. శంకర్పల్లి: కడుపునొప్పి భరించలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలకేంద్రంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. సీఐ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. శంకర్పల్లి పట్టణ కేంద్రానికి చెందిన ప్రవీణ్‌గౌడ్(22) కుటుంబ సభ్యులతో కలిసి రిత్విక్ వెంఛర్‌లో ఉంటాడు. గత కొన్ని రోజుల నుంచి తీవ్ర కడుపునొప్పితో బాధ పడుతుండేవాడు. శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో రాత్రి 10గంటల సమయంలో ఉరి వేసుకున్నాడు. చుట్టు పక్కల వారు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు ఇంటికి చేరుకొని బోరున విలపించారు. తండ్రి వెంకటేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
రెవెన్యూ అధికారులను అరెస్టు చేయాలి
బెల్లంపల్లి : రామగౌడ్ ఆత్మహత్యకు కారకులైన రెవెన్యూ అధికారులను అరెస్టు చేయాలని మాలమహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుసుమ భాస్కర్, జిల్లా అధ్యక్షుడు ఆసాది మధు, పట్టణ అధ్యక్షుడు కుంబాల రాజేశ్ డిమాండ్ చేశారు. పట్టణంలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్లో మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ పల్ల మహేష్ అనే వ్యక్తికి తప్పుడు కుల ధ్రువీకరణ పత్రం అందజేయడంతోనే రామగౌడ్‌పై అట్రాసిటీ కేసు నమోదైందని తెలిపారు. ఈ నేపథ్యంలో తహసీల్దార్, సర్పంచ్ తదితర అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. నాయకులు నగేష్, రవిరాజ్, గోపాల్, శ్రీధర్, చక్రధర్, ఆకాష్, సమ్మయ్య పాల్గొన్నారు. -
అప్పుల బాధతో ఇద్దరు రైతుల ఆత్మహత్య
ప్రత్తిపాడు/సంజామల: అప్పుల బాధకు రాష్ట్రంలో ఇద్దరు కౌలు రైతులు బలయ్యారు. అప్పులు తీర్చలేమన్న బెంగతో గుంటూరు జిల్లాలో వరి రైతు, కర్నూలు జిల్లాలో పత్తి రైతు బలవన్మరణానికి పాల్పడ్డారు. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం సౌపాడు గ్రామానికి చెందిన వరగాని సురేష్ (35) నాలుగేళ్లుగా చేబ్రోలు మండలం వేజెండ్ల గ్రామంలో పొలం కౌలుకు తీసుకుని వరిపంట సాగు చేస్తున్నాడు. సాగు కోసం మూడేళ్ల నుంచి వరుసగా అప్పులు చేస్తున్నాడు. ఈ ఏడాది కూడా వేజెండ్లలో పది ఎకరాల్లో వరి పైరును సాగు చేశాడు. ఇప్పటివరకు మొత్తం రూ.2.50 లక్షలు పెట్టుబడులు పెట్టాడు. ఇంకా పెట్టుబడులకు అప్పులు ఎక్కడా పుట్టకపోవడం, పైరు సైతం ఆశాజనకంగా లేకపోవడంతో సురేష్ రెండు మూడు రోజులుగా తీవ్ర మనస్తాపానికి గురవుతున్నాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ప్రత్తిపాడు వెళ్లి పొలానికి పురుగు మందులు కొనుక్కుని వస్తానని చెప్పి మార్గమధ్యంలో ఉన్న పొలంలోకి వెళ్లి జమ్మి చెట్టుకు లుంగీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శనివారం ఉదయం స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతుని తల్లి సామ్రాజ్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మూడేళ్లుగా పంట నష్టాలతో.. కర్నూలు జిల్లా సంజామల మండలం ఆల్వకొండ గ్రామానికి చెందిన కౌలురైతు దూదేకుల ఉసేన్‌వలి(25) అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఉసేన్‌వలి ఐదేళ్ల పాటు రెండు ఎకరాల పొలం కౌలుకు తీసుకొని సీడ్‌పత్తి సాగు చేశాడు. మూడేళ్లుగా వరుస పంట నష్టాలొచ్చాయి. ఈ మూడేళ్లలో పంటల సాగు, ఇతరత్రా అవసరాలకు చేసిన అప్పులు రూ.3 లక్షలకు చేరాయి. కౌలు గుర్తింపు కార్డు లేకపోవడంతో పంటరుణాలేవీ పొందలేకపోయాడు. ఏడాది క్రితం వ్యవసాయం మానేసి ఓ కాంట్రాక్టరు వద్ద పనిలో చేరాడు. ఆ డబ్బులు కుటుంబపోషణకే సరిపోయేవి. దీంతో ఇక అప్పులు తీర్చలేనన్న బెంగతో శుక్రవారం విషపు గుళికలు మింగాడు. అతన్ని నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. ఇతనికి భార్య ఉస్సేనమ్మ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రస్తుతం భార్య 8 నెలల గర్భిణి. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
వైద్యరంగంలో ఆత్మహత్యలెక్కువే..!
ఆత్మహత్యలకు పాల్పడుతున్నవారు వైద్యరంగంలో ఎక్కువే వైద్య కళాశాలలో స్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలి అమెరికా వైద్య నిపుణులు డాక్టర్ గార్లపాటి వంశీ గుంటూరు మెడికల్ : ఆత్మహత్యలకు పాల్పడుతున్నవారిలో వైద్యరంగానికి చెందిన వారు ఎక్కువగానే ఉన్నారని అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన ప్రముఖ మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ గార్లపాటి వంశీ చెప్పారు. గుంటూరు వైద్య కళాశాలలోని జింకానా ఆడిటోరియంలో సోమవారం ‘‘సెల్ఫ్ డైరెక్టెడ్ వయలెన్స్ ఇన్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్’’ అంశంపై సదస్సు జరిగింది. సదస్సులో డాక్టర్ వంశీ మాట్లాడుతూ గుంటూరులో వైద్య విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న విషయం పత్రికల్లో చదివి కనీసం ఒక్క జీవితాన్నైనా కౌన్సెలింగ్ చేసి కాపాడాలనే ఉద్దేశంతో గుంటూరు వచ్చినట్లు చెప్పారు. ఆత్మహత్య చేసుకోవాలనుకునే ఆలోచన ఉన్న వారు అందరూ ఆత్మహత్యకు పాల్పడరని, ఆత్మహత్యాయత్నం ప్రయత్నం చేసిన అందరూ ప్రాణాలు కోల్పోరన్నారు. ప్రవర్తనలో మార్పుల వల్ల తమను తాము గాయపరుచుకుంటారని, వీరు ప్రత్యేకమైన మనస్తత్వాన్ని కలిగి ఉండి ఎక్కువ ఒత్తిడికి గురవుతారన్నారు. వాలంటీర్లు, ఫార్మసిస్టులు, నర్సులు, మెడికోలు,, ఫిజీషియన్లు, సైకాలజిస్టులు, అందరూ ఎక్కువ ఒత్తిడికి గురవుతుంటారని, కౌన్సెలింగ్ తీసుకునేందుకు సుముఖంగా ఉండరన్నారు. వైద్య విద్యలో చేరిన తొలి మూడునెలల్లో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు, ఎక్కువగా ఉంటాయని, భారత దేశంలో ఎంబీబీఎస్ వైద్య విద్యార్థులు మొదటి సంవత్సరం ప్రారంభంలో 8 శాతం, ఏడాది చివరలో 22 శాతం ఈ ఆలోచన కలిగి ఉన్నారన్నారు. వైద్య విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడాలనే ఆలోచన కలిగి ఉన్నారనే విషయాన్ని బయటకు చెప్పరని, కళాశాల పరువు పోతుందని యాజమాన్యాలు ఈ విషయాన్ని దాస్తాయని చెప్పారు. ప్రతి ఏడాది 300 నుంచి 400 మంది ఫిజీషియన్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, మన దేశంలో 2010 నుంచి 2014 మధ్య 16 మంది వైద్య విద్యార్థులు చనిపోగా, వీరిలో తొమ్మిదిమంది వృత్తిపరమైన కారణాలతో ఆత్మహత్య చేసుకున్నట్టు వెల్లడించారు. ఈ లక్షణాలు గమనిస్తే... మనుషుల్లో కలిసేందుకు ఆసక్తి చూపకపోవడం, మాట్లాడకుండా మౌనంగా ఎక్కువ కాలం ఉండి పోవడం, వైద్యం కోసం వచ్చిన రోగులను విసుక్కోవడం, కోపగించుకోవడం, వృత్తి పట్ల ఆసక్తి లేకపోవడం, సరిగా నిద్రపోకపోవడం, కొద్దిపాటి విషయాలకే చికాకు పడడం, తదితర లక్షణాలు గమనిస్తే వీరు ఆత్మహత్యకు పాల్పడాలనే ఆలోచన కలిగి ఉన్నట్టు గుర్తించాలని చెప్పారు. ఒత్తిడి నివారణ మార్గాలను అన్వేషించాలని, సన్నిహితులతో మాట్లాడితే ఒత్తిడి తగ్గుతోందన్నారు. ప్రతి వైద్య కళాశాలలో వైద్య విద్యార్థులు చేరిన మొదటి ఏడాది రెండు దఫాలుగా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించడం ద్వారా వైద్య రంగ నిపుణులు ఆత్మహత్యలకు పాల్పడకుండా నివారించవచ్చన్నారు. గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గుంటుపల్లి సుబ్బారావు మాట్లాడుతూ పెద్ద కుటుంబాలు విడిపోయి చిన్న కుటుంబాలు అవడం వల్ల ఏదైనా సమస్య వచ్చినప్పుడు చెప్పేందుకు పెద్దలు తోడు లేకపోవడం వల్ల చిన్నపాటి విషయాలకే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. పిల్లలు ఏది అవ్వాలనుకుంటున్నారో తల్లిదండ్రులే నిర్ణయించి బలవంతంగా వారిపై తమ అభిప్రాయాలు రుద్దడం వల్ల పిల్లలు ఒత్తిడికి గురవుతున్నారన్నారు. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ తమ బలాలు, బలహీనతలు అంచనా వేసుకుని సమస్యలు ధైర్యంగా ఎదుర్కోవాలని చెప్పారు. సదస్సులో గుంటూరు వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ నల్లూరి మురళీకృష్ణ, జీజీహెచ్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ మార్కండేయులు, పలు వైద్య విభాగాధిపతులు, పలువురు వైద్యులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
అంతులేని వ్యధలు మిస్టరీ మరణాలు
తాడేపల్లి రూరల్, న్యూస్‌లైన్: కృష్ణానదిలో అంతుచిక్కని మరణాలు... మృగాళ్ల బారిన పడి తనువు చాలించిన అబలలు కొందరైతే, బతుకు భారమై ఆత్మహత్య లకు పాల్పడేవారు మరి కొందరు. ఆర్ధిక లావాదేవీల నేపథ్యంలో హత్యకు గురైన వారు కొందరైతే, ప్రమాదవశాత్తూ నీట మునిగి మరణించినవారు ఇంకొందరు. ఇలా ఏడాది పొడవునా ఎందరో అభాగ్యులు, అనాథలు కృష్ణానదిలో తనువు చాలించి, చివరకు ప్రకాశం బ్యారేజి వద్ద మృతదేహాలుగా తేలుతున్నారు. గత ఏడాది డిసెంబర్ నెలాఖరు నాటికి ప్రకాశం బ్యారేజి వద్ద పోలీసులు గుర్తించిన మృతదేహాల సంఖ్య 78, వీటిలో 36 మంది ఆచూకీ లభ్యం కాలేదు. మిగిలినవారిని బంధువులు గుర్తించారు. అంతుచిక్కని 36 మృతదేహాలను పోలీసులు నమోదు చేసుకున్నారే తప్ప వాటిమీద దర్యాప్తు చేయలేదు. కృష్ణా జిల్లా కంకిపాడు పోలీసు స్టేషన్ పరిధిలో మంతెన గ్రామానికి చెందిన సత్యనారాయణ అనే వ్యక్తిని అతని భార్య, ఆమె ప్రియుడు ఇద్దరూ కలిసి చంపి కృష్ణా నదిలో పడవేసిన విషయం ఆరు నెలల తరువాత గాని వెలుగుచూడలేదు. బ్యారేజి వద్ద నిఘా పెంచాలి... ప్రకాశం బ్యారేజికి ఇరువైపులా పోలీసులు నిఘా పెంచి వాహనాల తనిఖీలు చేపట్టగలిగితే కొన్ని కేసులు చిక్కుముడి వీడగలదు. గుంటూరు జిల్లా పరిధి ప్రకాశం బ్యారేజి 36వ కానా వరకు ఉండగా, తాడేపల్లి అవుట్ పోస్టు వద్ద నుంచి 6వ కానా కనపడే విధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో గత సంవత్సరకాలంలో ఆత్మహత్యలకు పాల్పడబోయిన 15 మందిని పోలీసులు కాపాడగలిగారు. అలాగే అవుట్ పోస్టు వద్ద వాహనాలను తనిఖీలు చేయడం వల్ల సంఘ విద్రోహశక్తులను అదుపులోకి తీసుకోగలిగారు. ప్రకాశం బ్యారేజిని అడ్డాగా చేసుకుని గంజాయి అమ్మకాలను కూడా నివారించగలిగారు. అవుట్‌పోస్టు, సీసీ కెమెరాల ఏర్పాటు చేయగలిగితే... తాడేపల్లి పోలీసులు ప్రకాశం బ్యారేజి వద్ద ఏర్పాటు చేసిన పోలీసు అవుట్ పోస్టు మాదిరిగానే విజయవాడ పోలీసులు అటువైపు బ్యారేజి వద్ద అవుట్ పోస్టుతోపాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే బ్యారేజిపై ఆత్మహత్యలు, హత్యలను నిలువరించడంతోపాటు సంఘ వ్యతిరేక శక్తులను పట్టుకునే అవకాశం ఉంటుంది. గతంలో ఓ ప్రేమ జంట బ్యారేజి మీద మాట్లాడుకుంటుండగానే హఠాత్తుగా ప్రియురాలు కృష్ణానదిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయాన్ని గమనించిన వాహనచోదకులు 100కు సమాచారం ఇవ్వడంతో అప్రమత్తమైన విజయవాడ పోలీసులు నిఘా అయితే పెంచారు కానీ ప్రియుడిని మాత్రం పట్టుకోలేకపోయారు. చివరకు మృతదేహం ఎవరిదో ఈ నాటికీ గుర్తించలేకపోయారు. అదే అవుట్ పోస్టు ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు ఉన్నట్టయితే ప్రియుడిని ఆనాడే గుర్తించగలిగేవారు. అంతేకాకుండా రెండు రోజుల క్రితం ప్రకాశం బ్యారేజి 34వ కానా వద్ద జీన్ ప్యాంటు, టీషర్టు ధరించిన సుమారు 20 సంవత్సరాల లోపు వయస్సు గల ఓ యువతి మృతదేహం లభ్యమైంది. ఇది హత్యా, ఆత్మహత్యా, అనేది పోలీసులకే అంతుచిక్కడం లేదు. ఇప్పటికైనా గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన పోలీసు ఉన్నతాధికారులు సంయుక్తంగా ప్రకాశం బ్యారేజి మొత్తం కనబడే విధంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తే నది వద్ద చాలా వరకు హత్యలను, ఆత్మహత్యలను నిలువరించే అవకాశం లేకపోలేదు.