ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-12వ సీజన్‌లో భాగంగా ఇక్కడ చిదంబరం స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న ఆరంభపు మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని ముందుగా ఆర్సీబీని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఇది తొలి మ్యాచ్ కావడంతో ఇరు జట్లు స్వేచ్ఛగా ఆడేందుకు సమాయత్తమయ్యాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి సీజన్‌ను విజయంతో ఆరంభించాలని ఇరు జట్లు భావిస్తున్నాయి.