27 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున.. ప్రపంచకప్-1992లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో జాంటీ రోడ్స్ చేసిన రనౌట్ మ్యాచ్ స్వరూపానే మార్చేసింది. ఇరుజట్ల మధ్య విజయం దోబూచులాడుతుండగా.. పాక్ బ్యాట్స్‌మన్ ఇంజమాముల్ హక్ ఆడిన బంతిని రోడ్స్ చురుగ్గా అందుకొని చిరుత కంటే వేగంగా పరిగెత్తి వికెట్లను గిరాటేసి ఔట్ చేశాడు. దీంతో ఒక్కసారిగా ఇంజమామ్ షాక్‌కు గురికాగా.. సఫారీ ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన పాక్‌కు వాతావరణం, అదృష్టం కలిసిరాలేదు. వెలుతురులేమి కారణంగా మ్యాచ్‌ను కాసేపు ఆపిన అంపైర్లు.. అనంతరం ఓవర్లను కుదించి పాక్ లక్ష్యాన్ని 36 ఓవర్లలో 193 పరుగులకు సెట్ చేశారు.