అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో టీమిండియా కొత్త చరిత్ర సృష్టించింది. ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక వన్డే సెంచరీలు సాధించి కొత్త అధ్యాయాన్ని లిఖించింది. శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌లో భారత ఓపెనర్ శిఖర్ ధావన్ శతకం సాధించడం ద్వారా ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక వన్డే సెంచరీలను సాధించిన రికార్డును సొంతం చేసుకుంది. ఫలితంగా దక్షిణాఫ్రికా(2015)లో రెండేళ్ల క్రితం సాధించిన 18 వన్డే సెంచరీల రికార్డును బ్రేక్ చేసింది. 2015లో సఫారీలు 18 వన్డే సెంచరీలు సాధించి ఒకనాటి టీమిండియా రికార్డును సమం చేశారు. 1998లో తొలిసారి 18 వన్డే శతకాల్ని భారత్ జట్టు సాధించగా, ఆపై 19 ఏళ్ల తర్వాత ఆ మార్కును సవరించింది.