అండర్‌-19 వరల్డ్‌ కప్‌లో భారత బోణీ | U19 World Cup India vs Australia, India beat Australia by 100 runs | Sakshi
Sakshi News home page

Published Sun, Jan 14 2018 3:19 PM | Last Updated on Fri, Mar 22 2024 11:03 AM

అండర్‌-19 వరల్డ్‌ కప్‌లో భారత కుర్రాళ్లు ఇరగదీశారు. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ జట్టు 100 పరుగుల తేడాతో అద్భుతమైన విజయాన్ని సాధించి శుభారంభం చేసింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో విభాగాల్లో సత్తాచాటిన భారత కుర్రాళ్లు.. పటిష్టమైన ఆసీస్‌కు షాకిచ్చారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ జట్టు 328 పరుగులు చేసింది. భారత ఓపెనర్లు పృథ్వీ షా(94;100 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు), మన్‌జోత్‌ కార్లా(86;99 బంతుల్లో 12 ఫోర్లు 1 సిక్సర్‌) రాణించి విజయంలో ముఖ్య పాత్ర పోషించారు. ఈ జోడి తొలి వికెట్‌కు 180 పరుగులు జోడించి మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఆపై శుభ్‌మాన్‌ గిల్‌(63; 54 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌) హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకోగా, అభిషేక్‌ శర్మ(23;8 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) బ్యాట్‌ ఝుళిపించడంతో భారత్‌ భారీ స్కోరు చేసింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement