టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భరత్ | Unchanged India Opted to Bat Against Australia | Sakshi
Sakshi News home page

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భరత్

Published Sun, Jun 9 2019 3:11 PM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా భారత్‌-ఆస్ట్రేలియాల మధ్య మెగా సమరానికి రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత జట్టు ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన టీమిండియా కెప్టెన్‌ కోహ్లి మరో మాట లేకుండా బ్యాటింగ్‌ చేసేందుకు మొగ్గుచూపాడు.  తాజా మ్యాచ్‌లో భారత్‌ ఎటువంటి మార్పు లేకుండా బరిలోకి దిగుతోంది. గత ప్రపంచకప్‌ సెమీ్‌సలో భారత్‌ను ఓడించి టైటిల్‌ ఆశలను నీరుగార్చిన ఆస్ట్రేలియాపై ప్రతీకారం తీర్చుకునే సమయం వచ్చింది. రెండు జట్లకు తాజా టోర్నీలో ఇప్పటిదాకా ఓటమి లేదు. ఆసీస్‌ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ నెగ్గగా భారత్‌ ఏకైక పోరులో సఫారీలను ఓడించింది. ఈ ఏడాది ఆసీస్‌, భారత్‌ ఎనిమిదిసార్లు తలపడితే 4-4తో సమానంగా ఉన్నాయి.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement