బాలీవుడ్‌లో ‘లేడి సూపర్‌స్టార్’గా గుర్తింపు తెచ్చుకున్న తొలి హీరోయిన్ శ్రీదేవి. అందం, అభినయానికి చిరునామగా నిలిచిన శ్రీదేవి హఠాన్మరణాన్ని ఆమె అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. నటిగానే కాదు నిజ జీవితంలో తల్లి పాత్రను అంతే సమర్ధవంతంగా పోషించారు శ్రీదేవి. పెద్దకూతురు జాహ్నవి కపూర్‌ను హీరోయిన్‌గా పరిచయం చేయడానికి ఎంతో కృషి చేశారు. ప్రస్తుతం ఈ తల్లికూతుళ్లకు సంబంధిచి ఒక ఆసక్తికర వీడియో వైరల్‌గా మారింది